‘బిగిల్’ తర్వాత దళపతి 64 యాక్షన్ సినిమానా?

0

ఇలయదళపతి విజయ్- అట్లీ కాంబినేషన్ అంటేనే హిట్టు ఖాయం. తేరి – మెర్సల్ (అదిరింది) తర్వాత ఈ కాంబినేషన్ మరోసారి రిపీటవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇరువరి కలయిలో వస్తున్న మూడో సినిమా `బిగిల్` (విజిల్ – ఈల అని అర్ధం) ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఇదివరకూ విజయ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి అభిమానుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఇందులో దళపతి విజయ్ ద్విపాత్రాభియనం చేస్తున్నారు. మైఖేల్.. బిగిల్గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా.. ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో నూ రిలీజ్ చేయనున్నారు. ఓ వైపు బిగిల్ చిత్రీకరణలో బిజీగా ఉండగానే విజయ్ నటించే 64వ సినిమా గురించి ప్రచారం హోరెత్తిపోతోంది.

తాజాగా దళపతి 64 చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది టీమ్. 2019 అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఎక్స్ బి ఫిలిం క్రియేటర్స్ పతాకంపై జేవియర్ బ్రిట్టో ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తాజాగా రిలీజైన ప్రీలుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఫైర్ వర్క్స్ బిగిన్! అంటూ పోస్టర్ పై వేశారు. అంటే ఇది విజయ్ కెరీర్ లో మరో భారీ యాక్షన్ చిత్రం అని అర్థమవుతోంది.

కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్- తళా అజిత్ లకు ధీటుగా అభిమాన బలం కలిగిన కథానాయకుడిగా ఇలయదళపతి విజయ్ పేరు మార్మోగిపోతోంది. ఓవైపు స్టార్ హీరోగా రాణిస్తున్న విజయ్ తొందర్లోనే రాజకీయాల్లోనూ ప్రవేశించే వీలుందన్న సంకేతాలు అందుతున్నాయి. అయితే రాజకీయాల విషయంలో అతడి మైండ్ లో ఏం ఉంది? అన్నది ఇప్పటివరకూ స్పష్టంగా రివీల్ కాలేదు. ప్రస్తుతానికి వరుసగా సినిమాలకు సంతకాలు చేస్తూ అభిమానుల్లో నిరంతరం హాట్ టాపిక్ గా మారుతున్నాడు. తాజా చిత్రం బిగిల్ కాస్టింగ్- సాంకేతిక నిపుణుల గురించి ప్రారంభోత్సవం లో పూర్తి వివరాలు తెలియజేస్తారట.



Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home