అనీల్ మరో పదేళ్లు ఏలేస్తాడు!- విజయశాంతి

0

దర్శకుడు అనీల్ రావిపూడి పేరు ఇప్పుడు ఇంటా బయటా హాట్ టాపిక్. రాజమౌళి- కొరటాల శివ తర్వాత అపజయమెరగని దర్శకుడిగా రావిపూడి పేరు మార్మోగుతోంది. కమర్శియల్ సినిమాలకు పర్ పెక్ట్ ఛాయిస్ అన్న నమ్మకాన్ని అతడు అగ్ర హీరోల్లో కల్పించాడు. అందుకే సూపర్ స్టార్ మహేష్ పిలిచి మరీ సరిలేరు నీకెవ్వరు చిత్రానికి పని చేసే అవకాశం ఇచ్చారు. ఈ సినిమా విజయం సాధిస్తే అనీల్ కెరీర్ కు ఎదురే లేదని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. రిలీజ్ కాకుండానే అనీల్ తో సినిమా చేయాలని కొందరు స్టార్ హీరోలు రెడీగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

ఈ నేపథ్యం లో తాజాగా సరిలేరు నీకెవ్వరు ప్రచారం లో భాగంగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి అనీల్ ట్యాలెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అనీల్ వెరీ ట్యాలెంటెడ్. అస్సలు టెన్షన్ పడడు. అనీల్ తో షూటింగ్ అంటే సెట్ లో పండగలా ఉంటుంది. సరిలేరు షూటింగ్ అప్పుడే అయిపోయిందా? అన్న ఫీలింగ్ కలిగింది. ఒక్కో సినిమాకు ఒక్కో తరహా స్క్రిప్ట్ ను అతడు ఎంచుకుంటాడు. సరిలేరు ఇతర సినిమాల తో పోలిస్తే చాలా విభిన్నంగా ఉంటుంది. నేను చెబితే అతి అవుతుందేమో కానీ… ఆ విషయం సరిలేరు చూసిన తర్వాత మీ అందిరకీ అర్ధమవుతుంది. అనీల్ కు మంచి భవిష్యత్ ఉంది. పంచ్ డైలాగులు భలేగా రాస్తాడు. మరో పదేళ్ల పాటు టాలీవుడ్ ని ఎల్తాడనడంలో ఎలాంటి సందేహం లేదని లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రశంసలు కురిపించారు.

సాక్షాత్తు విజయశాంతి లాంటి సీనియర్ నటి అనీల్ గురించి ఇంత గొప్పగా చెప్పారంటే సినిమాలో విషయం చాలానే ఉండి ఉంటుందని అభిమానుల్లో అంచనాలు రెట్టింపవుతున్నాయి. ఇక అనీల్ గురించి మహేష్ ఏమంటరో చూడాలి. ఆయన ఇంటర్వూ కోసం.. జనవరి 5న జరిగే ప్రీ రిలీజ్ కోసం ప్రేక్షకులు సహా ఫిల్మ్ మీడియా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అనీల్ సుంకర-దిల్ రాజు సంయుక్తం గా నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-