రాములమ్మ అంత రెమున్యరేషన్ తీసుకుందా?

0

తెలుగు వారికి ఏమున్నా లేకున్నా.. సినిమాలు ఉంటే చాలు మస్తుగా ఎంజాయ్ చేస్తారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. తెలుగోడి జీవితంలో సినిమా ఒక భాగం. దాంతో ఎంతగా కనెక్ట్ అవుతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా అగ్ర నటుడి సినిమానో.. పెద్ద సినిమా రిలీజ్ వేళ.. పొద్దు పొద్దున్నే హైదరాబాద్ లాంటి మహానగరంలో ఉదయం ఏడు గంటల వేళకే ఐమాక్స్ మొదలు.. పలు మల్టీఫ్లెక్సుల దగ్గర చూస్తే.. సినిమాకు తెలుగోడికి మధ్య కనెక్షన్ ఎంతన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది.

సంక్రాంతి పండక్కి ఐదారు రోజులు ఉన్నా.. పండుగ ఉత్సాహం రేపటి తో మొదలు కానుంది. దర్బార్ సినిమా రిలీజ్ తో సంక్రాంతి సినీ సంరంభం షురూ అయినట్లే. వరుస పెట్టి వచ్చే సినిమాలు.. వాటికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

సంక్రాంతి కి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నా.. అందరి చూపులు సరిలేరు నీకెవ్వరు.. అల వైకుంఠపురములో.. చిత్రాల మీదా.. దాని విశేషాల చుట్టూనే తిరుగుతున్నారు. ఇలాంటివేళ.. తాజాగా ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో పదమూడేళ్ల గ్యాప్ ను వదిలేసి.. రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతికి భారీ రెమ్యునరేషన్ ముట్టచెప్పినట్లుగా చెబుతున్నారు.

లేడీ అమితాబ్ ట్యాగ్ ఉన్న రాములమ్మకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చిన మాట ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిందంటున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన రష్మికకు మించిన రాములమ్మకు ముట్టినట్లుగా తెలుస్తోంది. దగ్గర దగ్గర రూ.1.5 కోట్లు ఇచ్చినట్లుగా చెబుతోంది. ఈ సినిమాలో నటించాలని దర్శకుడు అనిల్ రావిపూడి కోరినప్పుడు సానుకూలంగా రాములమ్మపెద్దగా రియాక్ట్ కాకున్నా.. పట్టుబట్టి ఒప్పించటంతో ఓకే అన్నట్లు చెబుతున్నారు.

అయితే.. సినిమాలో పాత్రతో పాటు.. ఆమెకు ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ కూడా రాములమ్మ ఓకే చెప్పటానికి కారణంగా చెబుతున్నారు. ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ఇంత భారీ మొత్తం నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అంటూ సరిలేరునీకెవ్వరు స్టైల్ లో చెప్పేస్తున్నారు. ఏమైనా.. రీఎంట్రీతో ఇంత హాట్ టాపిక్ గా మారటం రాములమ్మకే సాధ్యం.
Please Read Disclaimer