ఈ సారి బ్రేక్ కాదు గుడ్ బై చెప్పినట్లేనా?

0

లేడీ సూపర్ స్టార్.. లేడీ అమితాబ్ అంటూ కీర్తించబడ్డ విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లిన కారణంగా సినిమాలకు దూరం అయ్యింది. దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రంతో విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న ఆమె రాజకీయంగా బిజీ లేని కారణంగా సినిమాల్లో ఇకపై కంటిన్యూగా నటిస్తారని అంతా భావించారు. సరిలేరు నీకెవ్వరు చేస్తున్న సమయంలో మరియు సినిమా విడుదలైన తర్వాత పలువురు నిర్మాతలు ఆమె వద్దకు వెళ్లారట. కొందరు దర్శకులు ఆమె వద్దకు లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ లతో వెళ్లారట. కాని ఏ ఒక్కరికి ఆమె ఓకే చెప్పలేదు.

సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత తన వద్దకు నిర్మాతలు మరియు దర్శకులు వరుసగా వస్తున్న కారణంగా ఆమె ఒకొక్కరికి చెప్పడం ఎందుకు అనుకుందో లేక మరేంటో కాని ఇకపై తాను సినిమాలు చేయను.. ప్రస్తుతం తాను రాజకీయాలకే పూర్తి ప్రాముఖ్యత ఇస్తాను అంటూ అనధికారికంగా సినిమాలకు గుడ్ బై చెప్పింది. సోషల్ మీడియా ద్వారా ఆమె సుదీర్ఘం గా తనను ఆధరించిన వారికి కృతజ్ఞతలు తెలిజేస్తూ సినీ జీవితం పై ఎమోషనల్ గా ట్వీట్ చేసింది.

ఆమె చేసిన ట్వీట్ తో సరిలేరు నీకెవ్వరు తర్వాత బ్రేక్ తీసుకుంటున్నట్లుగా కాకుండా సినిమాలకు గుడ్ బై చెప్పినట్లుగానే ఉందని.. ఇక శెలవు అంటూ ట్వీట్ చేశారు కనుక ఆమె మళ్లీ వెండి తెరపై కనిపించే అవకాశమే లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విజయశాంతి నిర్ణయాన్ని ఫ్యాన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు కూడా చేయాలని కోరుతున్నారు. కాని ఆమెకు మాత్రం సినిమాల పై ఆసక్తి లేదని ఈ ట్వీట్ తో తేలి పోయింది.

విజయశాంతి ట్వీట్…

#సరిలేరు_మీకెవ్వరు ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు నా నట ప్రస్ధానానికి 1979 కళ్ళుకుల్ ఇరమ్కిలాడి కృష్ణుడు నుండి నేటి 2020 సరిలేరునీకెవ్వరు వరకు ఆగౌరవాన్ని అందించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు.

ప్రజా జీవన పోరాటం లో నా ప్రయాణం… మళ్లీ మరో సినిమా చేసే సమయం సందర్భం నాకు కల్పిస్తోందో లేదో నాకు కూడా తెలియదు.. ఇప్పటికి ఇక శెలవు. మనసు నిండిన మీ ఆదరణకు నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు.
Please Read Disclaimer