సరిలేరు వేడుకతో ఆ కల నెరవేరేనా?

0

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను ఈనెల 5వ తారీకున భారీ ఎత్తున నిర్వహించబోతున్న విషయం తెల్సిందే. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరు కాబోతున్న విషయం కూడా తెల్సిందే. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన విజయశాంతి కూడా ప్రీ రిలీజ్ వేడుకలో హాజరు అయ్యే అవకాశం ఉంది. చిరంజీవి మరియు విజయశాంతిలను ఒకే వేదికపై చూసి చాలా ఏళ్లు అయ్యింది.

ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ పెయిర్ గా వెలుగు వెలిగిన వీరిద్దరు ఆ తర్వాత ఏదో కారణం వల్ల మళ్లీ కలిసింది లేదు. రాజకీయాలతో బిజీ అయిన విజయశాంతి సినిమాలకు దూరం అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇదే సమయంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి హాజరు కాబోతున్న కారణంగా ఆ వేదికపై చిరంజీవి మరియు విజయశాంతిలను కలిపి చూడవచ్చు అంటూ వీరిద్దరి కాంబోను ఇష్టపడే వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుకలో విజయశాంతి హాజరు అవుతుందా లేదా అనే విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఒకవేళ హాజరు అయితే కనుక వీరిద్దరి జంటకు అభిమానులు అయిన వారికి కన్నుల పండుగే. ఒకప్పుడు వీరి జోడీని చూస్తూ విజిల్స్ వేసిన వారు మళ్లీ వీరిని ఒకే స్టేజ్ పై ఒకే ఫ్రేమ్ లో చూడాలని ఆశ పడుతున్నారు. కలలు కంటున్నారు. మరి వారి కలలు నెరవేరేనా లేదా అనేది ఈనెల 5వ తారీకున తేలిపోనుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-