రాములమ్మ మాటను ఇప్పటి హీరో.. హీరోయిన్లు విన్నారా?

0

ఒక సినిమా తర్వాత మరొకటి. కొంతమంది అయితే ఒక సినిమా చేసిన తర్వాత రెస్ట్.. హాలీడే ట్రిప్పు.. ఆ సినిమా నుంచి బయటకు వచ్చి.. మామూలుగా మారటం.. మరో సినిమాకు ప్లాన్ చేయటం లాంటి మాటలు వింటే.. ఇప్పటి హీరోలు హీరోయిన్లు పని చేస్తున్నది ఎంతన్నది ఇట్టే అర్థం కాక మానదు. గతంలో ప్రముఖ హీరోలు.. హీరోయిన్లు ఎంతలా పని చేశారో? వారి కష్టం ముందు పోలిస్తే.. ఇప్పటివారి పని ఎంతన్నది తెలుస్తుంది.

తాను హీరోయిన్ గా పని చేసే సమయంలో కారులోనే మేకప్ వేసుకునే విషయాన్ని గుర్తు చేసుకున్నారు విజయశాంతి. షూటింగ్ కు వచ్చేటప్పుడే దానికి తగ్గట్లు మేకప్ వేసుకొని వచ్చేశారన్న మాటకు విజయశాంతి ఆసక్తికర విషయాలు చెప్పకొచ్చారు.

ఇప్పుడంటే కారులో.. సెట్ లోనూ ఏసీ ఉండేదని.. అప్పట్లో అవేమీ ఉండేవి కావని.. ఒక రోజులో ఆరు షూటింగ్ లకు వెళ్లాల్సి ఉండేదని.. అది కూడా ఒక్కో లొకేషన్లో ఒక్కో షూట్ ఉండటంతో నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా తాను కారులోనే మేకప్ చేసుకొని వెళ్లేదానినని రాములమ్మ చెప్పారు.

కారులోనే మేకప్.. హెయిర్ స్టైల్ సెట్ చేసుకొని షూటింగ్ స్పాట్ కు చేరుకునే వాళ్లమని.. జనరేటర్ వ్యాన్ లో డ్రెస్ లు మార్చుకునేవాళ్లమన్నారు. అప్పట్లో వరుసగా సినిమాలు చేసేవాళ్లమని.. హిట్.. ప్లాప్ ల్ని పట్టించుకోకుండా పని చేసినట్లుగా చెప్పారు. ఇప్పుడు మాత్రం చేసే ప్రతి సినిమాను జాగ్రత్తగా చేసుకోవాలంటూ అప్పటికి.. ఇప్పటికి షూటింగ్ లలో వచ్చిన మార్పును ఆమె చెప్పేశారు. రాములమ్మ మాటల్నివింటే ఇవాల్టి రోజున హీరోలు.. హీరోయిన్లు చేస్తున్న పని ఎంతన్నది ఇట్టే అర్థం కావటమే కాదు.. పనిని ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారో ఇట్టే అర్థం కాక మానదు. భారీ రెమ్యునరేషన్ తీసుకుంటూ ఏడాదికి ఒకట్రెండు సినిమాలు కూడా చేయని నటీనటుల సంగతి చూస్తే.. వారెంత కష్టపడిపోతున్నారో రాములమ్మ మాటలు బాగా అర్థమయ్యేలా చేస్తాయని చెప్పక తప్పదు.
Please Read Disclaimer