తన ఫ్యూచర్ గురించి హింట్ ఇచ్చిన రాములమ్మ

0

ఒకప్పుడు లేడీ సూపర్ స్టార్ గా.. లేడీ బాగ్ గా అభిమానులతో పిలిపించుకున్న రాములమ్మ విజయశాంతి రాజకీయాలకు వెళ్లిన తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. సుదీర్ఘ విరామం తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రం కోసం విజయశాంతి కెమెరా ముందుకు వచ్చారు. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఆమె చాలా పవర్ ఫుల్ రోల్ పోషించారు. ఇన్నేళ్లు అయినా కూడా ఆమెలో అదే గాంభీర్యం.. అదే వర్చస్సు. చిరంజీవి అన్నట్లుగా ఆమె ఏమాత్రం తగ్గలేదు అని చెప్పుకోవచ్చు.

ఇక సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుక లో విజయశాంతి మాట్లాడిన మాటలు ఆమె ఫ్యూచర్ ప్లానింగ్ పై హింట్ ఇచ్చినట్లుగా ఉంది. మెల్ల మెల్లగా రాజకీయాలకు రాములమ్మ దూరం అవ్వాలనుకుంటుందని.. ఆమె రాజకీయాల్లో లేకుండా జనాలకు దగ్గరగా ఉంటూ వారికి సేవ చేసే ఉద్దేశ్యం లో ఉన్నట్లు గా ఆమె మాటలు ఉన్నాయి అంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇకపై వరుసగా సినిమాల్లో నటించడం తో పాటు రాజకీయాలకు కూడా దూరంగా ఉండాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్లుగా అనిపిస్తుందని జనాలు అనుకుంటున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న రాములమ్మ కు పెద్దగా ఆ పార్టీలో ప్రాముఖ్యత దక్కడం లేదనే కామెంట్స్ వస్తున్నాయి. బీజేపీకి వెళ్లే ఆలోచన గతంలో చేసిందని వార్తలు వచ్చాయి. కాని బీజేపీతో కూడా విజయశాంతికి సరైన సంబంధాలు లేవు. ఆ కారణంగానే పూర్తిగా రాజకీయాల్లోంచి బయటకు వెళ్లిపోయే ఆలోచన ఏమైనా చేస్తుందా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె రాజకీయాల సంగతి ఏమో కాని వరుసగా చిత్రాలు చేయబోతున్నందుకు మాత్రం ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు. వీలు కుదిరితే చిరంజీవితో కూడా కలిసి నటించేందుకు ఆమె సిద్దంగా ఉన్నట్లుంది. నిన్నటి వేడుకలో చిరంజీవితో కలిసి నటిద్దాం అంటూ చెప్పిన విషయం తెల్సిందే.
Please Read Disclaimer