దీపావళికి లేడీ బాస్ ఫస్ట్ లుక్

0

దాదాపు 13ఏళ్ల గ్యాప్ తర్వాత ముఖానికి రంగేసుకుని నటనలోకి దిగారు లేడీ బాస్ విజయశాంతి. కెరీర్ పీక్స్ లో గ్లామరస్ నాయికగా ఎంత పాపులారిటీ దక్కిందో అంతకుమించి ఎన్నో ప్రయోగాత్మక పాత్రలతో అభిమానుల గుండెల్లో నిలిచిన టాప్ స్టార్ గా ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచే ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ- మహేష్ నటించిన పలు విజయవంతమైన చిత్రాల్లోనూ విజయశాంతి నటించారు. అలా మహేష్ తో కలిసి నటించినప్పటి ఓ ఫోటోని షేర్ చేసి లైఫ్ ఎక్కడ మొదలవుతుందో అక్కడికే తిరిగి వస్తుంది! అంటూ ఆసక్తికర వ్యాఖ్యను చేశారు.

తన రీఎంట్రీ సినిమా మహేష్ తోనే కావడంతో ఎగ్జయిట్ మెంట్ ని చూపించారు. మహేష్ తో కలిసి దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో నటించే అవకాశం దక్కింది. ఇక ఈ చిత్రంలో విజయశాంతి ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని .. కాలేజ్ లెక్చరర్ గా అదరిపోయే గెటప్ తో కనిపిస్తారని తెలుస్తోంది. డే1 మేకప్ వేసుకునేప్పుడు అద్దంలోకి చూస్తూ ఉన్న విజయశాంతి ఫోటో ఒకటి తాజాగా రివీలైంది. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ లో తన రూపం ఎలా ఉండబోతోంది? అన్న క్యూరియాసిటీ అభిమానుల్ని నిలవనీయడం లేదు. చీరలో విజయశాంతి లుక్ హుందాగా ఉంటుంది. అలాగే అల్ట్రా మోడ్రన్ అత్తగారి రేంజులో స్పెషల్ హెయిర్ స్టైల్ తో కనిపిస్తారని అంచనా వేస్తున్నారు.

అయితే ఈ సస్పెన్స్ కి తెర వీడేందుకు ఇంకెంతో సమయం లేదు. ఈ దీపావళి(శని-ఆదివారాలు) కానుకగా అనీల్ రావిపూడి బృందం విజయశాంతి ఫస్ట్ లుక్ లాంచ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో మహేష్ లుక్ ఎలా ఉంటుంది? అన్నది ఇప్పటికే రివీలైంది. ఆర్మీ మేజర్ గా మహేష్ లుక్ అదుర్స్ అంటూ అభిమానులు కితాబిచ్చేశారు. ఇప్పుడు విజయశాంతి లుక్ మరింతగా అంచనాల్ని పెంచేస్తుందనడంలో సందేహం లేదు. సంక్రాంతి కానుకగా 12 జనవరి 2020న సినిమా రిలీజ్ కానుంది. దేవీశ్రీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Please Read Disclaimer