లేడీ సూపర్ స్టార్ సరికొత్త సాహసం?

0

ఇరుగు పొరుగు పరిశ్రమల నుంచి వచ్చి సొంతంగా డబ్బింగ్ చెప్పేస్తున్న అందాల కథానాయికలు ఎందరో. ముఖ్యంగా మాలీవుడ్ శాండల్ వుడ్ సహా ముంబై నుంచి వచ్చిన భామలు తెలుగు సినిమాలకు సొంతంగా డబ్బింగులు చెప్పేయడం తెలుగు మాట్లాడేయడం ఆశ్చర్యపరుస్తోంది. ముంబై బ్యూటీ తమన్నా తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. చెన్నయ్ చంద్రం సమంత తెలుగు మాట్లాడడంలో సో స్వీట్. నిన్నగాక మొన్న వచ్చిన కీర్తి సురేష్- నివేద థామస్ లాంటి మల్లూ భామలు తెలుగును అదరగొడుతున్నారు. వీళ్లకు వేరొకరు డబ్బింగులు చెప్పాల్సిన పనేలేదు. అయితే సౌలభ్యం కోసం డబ్బింగ్ చెప్పించుకున్న సందర్భాలున్నాయంతే.

ఇక ఇదే తరహాలో తెలుగమ్మాయి అయినా కానీ.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి అప్పట్లో సౌలభ్యం కోసం తన పాత్రకు డబ్బింగ్ చెప్పించుకునేవారు. తన సమకాలీన నటి సరిత తనకు డబ్బింగ్ చెప్పేవారు. ఆ వాయిస్ ఆడియెన్ కి బాగా కనెక్టయిపోవడంతో తననే చాలా కాలం కొనసాగించారు. పైగా తను డబ్బింగ్ చెప్పిన వాటిలో చాలా హిట్లే. కట్ చేస్తే తానే డబ్బింగ్ చెప్పుకుంటే ఎలా ఉంటుంది అనుకుని ట్రై చేసినా ఆ సినిమాలేవీ హిట్లు కాలేదు.

అయితేనేం ఈసారి మొండిగానే వోన్ డబ్బింగ్ చెబుతున్నారు. రాజకీయాల్లోకి వెళ్లి చాలా గ్యాప్ తీసుకుని తిరిగి సినీ ఎంట్రీ ఇస్తున్న లేడీ బాస్ విజయశాంతి తనకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో తన సొంత గొంతునే వినిపించబోతున్నారు. మొన్న రిలీజైన టీజర్ తోనే అది అందరికీ అర్థమైంది. ఇక పూర్తి సినిమాలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంటున్నారట. సెంటిమెంటు ప్రకారం తన గొంతు వినిపిస్తే హిట్టు రాలేదు. అయినా పట్టుబట్టి మరీ చెప్పుకుంటున్నారు ఇప్పుడు. సొంత గొంతుతో సత్తా చాటాలనే ప్రయత్నమే ఇదని చెబుతున్నారు. మరి ఈసారి ఎలా వర్కవుటవుతుంది? అన్నది చూడాలి. మహేష్ – రష్మిక- విజయ శాంతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు 2020 సంక్రాంతికి రిలీజవుతున్న సంగతి తెలిసిందే.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home