విక్రమ్ కుమార్ కు మెగా ఛాన్స్?

0

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘RRR’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ ఏ సినిమాలో నటిస్తారనే విషయంలో ఇప్పటివరకూ పెద్దగా క్లారిటీ రాలేదు. అయితే ఫిలిం నగర్లో కొత్త టాక్ ఏంటంటే టాలెంటెడ్ ఫిలిం మేకర్ విక్రమ్ కుమార్ తో సినిమా చేసేందుకు చరణ్ రెడీ అవుతున్నారట.

విక్రమ్ కెరీర్ లో ‘ఇష్క్’.. ‘మనం’ లాంటి సూపర్ హిట్స్ ఉన్నప్పటికీ ఈమధ్య మాత్రం చెప్పుకోదగ్గ విజయం దక్కలేదు. విక్రమ్ దర్శకత్వం వహించిన చివరి రెండు సినిమాలు ‘హలో’.. ‘గ్యాంగ్ లీడర్’ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి. అయితే ఈ జయాపజయాలతో సంబంధం లేకుండా విక్రమ్ తో పనిచేసేందుకు చరణ్ ఆసక్తి చూపిస్తున్నాడట. విక్రమ్ ఇప్పటికే చరణ్ కు ఓ ఇంట్రెస్టింగ్ స్టొరీలైన్ కూడా వినిపించాడట. చరణ్ గో ఎహెడ్ అనడంతో కోసం స్క్రిప్ట్ తయారుచేయడం కూడా ప్రారంభించాడట. అంతా అనుకున్నట్టుగా జరిగితే ‘RRR’ తర్వాత చరణ్ నటించే సినిమా ఇదే కావొచ్చని సమాచారం.

నానితో ‘గ్యాంగ్ లీడర్’ తెరకెక్కించక మునుపు అల్లు అర్జున్ కోసం విక్రమ్ ఒక కథ తయారు చేశాడు. అయితే స్క్రిప్ట్ పూర్తిచేసిన తర్వాత బన్నీకి సంతృప్తికరంగా అనిపించకపోవడంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. మరి చరణ్ తో అయినా విక్రమ్ సినిమా ఫిక్స్ అవుతుందో లేదో వేచి చూడాలి.
Please Read Disclaimer