PUBG తో ఆ స్టార్ కిడ్ ఎంట్రీ!

0

తమిళ స్టార్ హీరో విక్రమ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. అయితే ఈమధ్య వరసబెట్టి ఫ్లాపులు తగలడంతో తెలుగులో క్రేజ్ తగ్గింది. తమిళంలో కూడా పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. విక్రమ్ పరిస్థితి ఇలా ఉంటే విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. త్వరలో ‘ఆదిత్య వర్మ’ టైటిల్ తో ఈ సినిమా రిలీజ్ కానుంది.

ధృవ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా విడుదల కాకమునుపే విక్రమ్ ఫ్యామిలీ నుంచి మరో అబ్బాయి హీరోగా తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నాడట. విక్రమ్ మేనల్లుడు అయిన ఈ అబ్బాయి పేరు అర్జుమాన్. విక్రమ్ చిన్న చెల్లెలు అనిత కుమారుడు ఈ అర్జుమాన్. ఇప్పుడు ధృవ్ ను హీరోగా నిలబెట్టే బాధ్యతతో పాటుగా తన మేనల్లుడు అర్జుమాన్ బాధ్యత కూడా విక్రమ్ తలకెత్తుకున్నాడట.

అర్జుమాన్ డెబ్యూ ఫిలిం ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటూ ఉందట. ఈ సినిమా టైటిల్ ‘PUBJ’. ఈ పేరు చూడగానే పాపులర్ మొబైల్ గేమ్ గుర్తొస్తోంది కదా.. అయితే ఈ టైటిల్ ఫుల్ ఫామ్ ‘పొల్లాద ఉళగిల్ భయంగర గేమ్’. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ ఐశ్వర్య దత్తా హీరోయిన్ గా నటిస్తోంది. GDE ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.




Please Read Disclaimer