సందీప్ వంగాపై అక్కసు ఎందుకు?

0

హైదరాబాద్ లో దిశా ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి టోల్ గేట్ కు కూతవేటు దూరంలో `దిశ` అత్యంత దారుణంగా హత్యాచారానికి గురవ్వడం తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన యావత్ భారతాన్ని కదిలించింది. దీనిపై రాజకీయ వర్గాలు.. సినీ సెలబ్రిటీలు.. సామాన్య జనం ఘాటుగానే సంపందిస్తున్నారు. తమ నిరసన తెలియజేస్తున్నారు.

తాజాగా ఈ ఉదంతంపై `అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్ రెడ్డి వంగ స్పందించారు. “ఇకపై ఇలాంటి సంఘటనల జరగకూడదంటే దానికి ఒక్కటే మార్గం.. వారిలో భయాన్ని కలిగించడమే“ అని ట్వీట్ చేశారు. అయితే అతడి ట్వీట్ పై బాలీవుడ్ దర్శక రచయిత.. నిర్మాత విక్రమాదిత్య మోత్వానీ ఘాటుగా స్పందించడం చర్చకు వచ్చింది.

సందీప్ వంగా స్పందనపై విక్రమాదిత్య ఘాటుగా స్పందించారు.“మీరు చెప్పిన భయం ఆమెను కొట్టడం వల్ల పోతుందేమో“ అని గట్టి కౌంటరివ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఊహించని ఈ కౌంటర్ కు సందీప్ వంగ మాత్రం స్పందించకుండా సైలెంట్ గా వున్నారు. అయితే విక్రమాదిత్య కౌంటర్ కి కారణం.. సందీప్ వంగ రూపొందించిన `కబీర్సింగ్` చిత్రంలోని ఓ సన్నివేశం. ఈ చిత్రంలో హీరో హీరోయిన్ ని కొట్టే సన్నివేశానికి తాజా ఘటనను ముడిపెట్టి ఇలా కౌంటరేశాడన్నమాట. ఇక అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చి సంచలన విజయం సాధించిన కబీర్ సింగ్ పై ఎందరో ఎన్నో రకాలుగా విమర్శించారు. ఇప్పటికీ విమర్శిస్తూనే ఉన్నారు. 2019 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన సందీప్ రెడ్డిని ఈ ట్రోల్స్ మరింత పెద్ద సెలబ్రిటీ డైరెక్టర్ గా మార్చాయి. కొన్నిసార్లు అతడిపై అక్కసు కూ`డా బయటపడింది. ఇప్పుడు సదరు దర్శకరచయిత కం నిర్మాత కూడా అలానే అక్కసు వెల్లగక్కాడని అనుకోవాలేమో.
Please Read Disclaimer