హీరోయిన్ కొడితే హ్యాపీగా ఫీలైన విలన్

0

రీల్ లో అదరగొట్టే విలనిజంతో.. బయట కనిపిస్తే చాలు చితక్కొట్టేయాలన్నట్లుగా నటించే రీల్ విలన్లు చాలామందే ఉంటారు. కానీ.. షూటింగ్ లో భాగంగా తాను చేసే పనులకు హీరోయిన్ ఫీల్ అవుతున్న తీరుకు బాధ పడే విలన్లు ఉంటారా? అంటే.. ఇప్పటివరకూ ఈ తరహా ఫీలింగ్స్ ను బయటపెట్టిన విలన్ కనిపించలేదనే చెప్పాలి. అందుకు భిన్నంగా తాజాగా తన ఫీలింగ్స్ తో మనసుల్ని దోచేశాడు డియర్ కామ్రేడ్ మూవీలో విలన్ గా చేసిన రాజ్ అర్జున్.

బాలీవుడ్ చిత్రాలు చేసే ఈ నటుడు.. డియర్ కామ్రేడ్ మూవీ షూట్ వేళలో జరిగిన కొన్ని ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. సినిమా చివర్లో తనను రష్మిక కొట్టే సీన్ తో హ్యాపీగా ఫీల్ అయ్యానని చెప్పాడు. ఎందుకిలా అంటే.. సినిమా కథలో భాగంగా రష్మికను చాలా ఇబ్బంది పెడతానని.. ఆ షూట్ చేసేటప్పుడు.. షాట్ ఓకే తర్వాత కూడా ఆమె అదే మూడ్ లో ఉండేదని.. చాలాసార్లు ఏడుస్తూ ఉండిపోయేదని చెప్పాడు.

షాట్ అయ్యాక.. తాను ఆమె దగ్గరకు వెళ్లి.. అవి కేవలం సీన్స్ మాత్రమే.. బాధ పడి ఉంటే సారీ .. బాధపడొద్దని చెప్పేవాడినని.. అలాంటిది చివర్లో నన్ను కొట్టినప్పుడు తాను అంతో ఇంతో సంతోషపడి ఉంటుందన్న ఉద్దేశంతో తాను హ్యాపీగా ఫీల్ అయినట్లు చెప్పాడు. ఆ సీన్ లో కొట్టటంతో తన మీద ఉన్న కోపం మొత్తం పోయి ఉంటుందనుకున్నానని చెప్పాడు. ఏ సినిమాలో అయినా.. హీరో.. హీరోయిన్.. విలన్ కాంబినేషన్లో స్నేహం కుదరదని.. కానీ ఈ సినిమాతో తాము ముగ్గురం చాలా మంచి ఫ్రెండ్స్ అయినట్లు చెప్పాడు అర్జున్. కాస్త లేట్ గా రివీల్ చేసినా.. అర్జున్ కొత్త విషయాల్ని చెప్పాడని చెప్పాలి.
Please Read Disclaimer