భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం - LIVE

శీనయ్యను ఏదోలా ఒడ్డున్న పడేయనున్నారా?

0

వివి వినాయక్ హీరోగా పరిచయం అవుతున్న ‘శీనయ్య’ చిత్రం షూటింగ్ కొన్ని రోజుల క్రితం ఆగిపోయింది అంటూ ప్రచారం జరిగిన విషయం తెల్సిందే. దర్శకుడు నరసింహారాజు స్క్రిప్ట్ విషయంలో నిర్మాతను సంతృప్తి పర్చలేక పోతున్నాడని ఆ కారణంగానే మళ్లీ మళ్లీ మార్పులు చేర్పులు చేస్తూ సినిమా షూటింగ్ ను ఆపేసినట్లుగా ప్రచారం జరిగింది. అధికారికంగా బయటకు చెప్పకున్నా కూడా శీనయ్య సినిమాను ఆపేశారంటూ కీలక వ్యక్తుల నుండి సమాచారం అందింది.

దర్శకుడిగా గడ్డు కాలంను ఎదుర్కొంటున్న వినాయక్ ఈ సినిమాతో నటుడిగా అయినా బిజీ అవుతాడని ఆయన సన్నిహితులు మరియు అభిమానులు భావించారు. కాని ఈ సినిమా మద్యలో అటకెక్కడంతో వారంతా కూడా నిరాశ పడ్డట్లుగా తెలుస్తోంది. వినాయక్ సినిమా ఆగిపోకుండా ఉండేందుకు పలువురు పలు ప్రయత్నాలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. చివరకు శీనయ్యను మళ్లీ పట్టాలెక్కించేందుకు సిద్దం అయ్యారు.

శీనయ్య చిత్రం ఫలితం ఎలా అయినా రానివ్వు కాని సినిమాను అయితే పూర్తి చేయాలని వినాయక్ కోసం అయినా సినిమాను విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నాడట. అందుకే స్క్రిప్ట్ విషయంలో నూరు శాతం సంతృప్తి చెందకుండానే సినిమాను మళ్లీ షూట్ కు తీసుకు వెళ్లాలని నిర్ణయించారట. ఏదోలా సినిమాను పూర్తి చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారట.

వినాయక్ నటుడిగా మొదటి సినిమా కనుక ఆయనకు మరియు ఆయన అభిమానుల కోసం అంటూ సినిమాను ఒడ్డున పడేయాలని నిర్ణయించుకున్నారట. అందుకే సినిమాను పూర్తి చేసి సమ్మర్ చివర్లో విడుదల చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని యూట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-