వెంకీ మామ పాలిట జయప్రద లా ఉందిలే

0

`అడవి రాముడు` వెంట పడిన జయప్రదలా .. `డ్రైవర్ రాముడు` ప్రేమించిన జయసుధ లా.. `వేటగాడు` వల్లో వేసిన శ్రీదేవి లా.. ఆవిడెవరు? ఇంతకీ ఆవిడెవరు? ఆ ముగ్గురు సీనియర్ భామల్ని స్ఫూర్తి గా తీసుకుందో ఏమో నేటితరం అందాల నాయిక పాయల్ రాజ్ పుత్ ఏకంగా రెట్రో డేస్ లోకి వెళ్లి పోయింది. అచ్చం గా జయప్రద-శ్రీదేవిల ఆహార్యాన్ని ఇమ్మిటేట్ చేస్తున్నట్టే కనిపిస్తోంది. మరీ అంతగా ఎన్టీఆర్.. శోభన్ బాబులా వెంకీ మామ ఇలా వెంట పడిపోతుంటే ఏదో ఒకటి చేయాలి కదా!.. అదిరిపోయే ఎక్స్ ప్రెషన్ తో చంపేస్తున్నారు కదూ? 80ల నాటి లుక్ ని నాటి వాతావరణాన్ని తెచ్చేశారు ఈ జోడీ.

ఎన్నాళ్ల కో అంటూ సాగే పాట ఇది అంటూ ట్విట్టర్ లో ప్రకటించింది చిత్ర బృందం. ఒక రకంగా `అడవి రాముడు` చిత్రంలోని ఎన్నాళ్లకెన్నాళ్ల కెన్నల్లో కొ..సాంగ్ లా ఉంది! అంటూ అభిమానులు ట్విట్టర్ లో ఈ పోస్టర్ కి కామెంట్లు పెడుతున్నారు. విక్టరీ వెంకటేష్ – పాయల్ రాజ్ పుత్ మధ్య బోలెడంత రొమాన్స్ అదిరిపోయే ఫన్ ఎలివేట్ కానుందని ఈ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇక మామనే ఇలా రెచ్చిపోతుంటే రాశీఖన్నా తో కలిసి అల్లుడు నాగ చైతన్య ఇంకెంత రచ్చ చేస్తాడో ఏమిటో! అయితే ఆ రచ్చకు సంబంధించిన సరైన అప్ డేట్ కోసం చైతూ అభిమానులు ఏకంగా మామ వెంకీకే వార్నింగులు ఇస్తున్నారు. దర్శకుడు బాబిని నిర్మాత డి.సురేష్ బాబు ను ప్రశ్నిస్తూ చైతూ కొత్త లుక్ ఎప్పుడూ? అంటూ సోషల్ మీడియా లో నానా హంగామా చేస్తున్నారు.

నవంబర్ 23న వెంకీమామ టీజర్ రాకపోతే మామూలు గా ఉండదు! అంటూ వార్నింగులు ఇచ్చారు కొందరైతే. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ కి రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక అదే సీజన్ లో దబాంగ్ 3 లాంటి భారీ చిత్రం రిలీజ్ కి వస్తుంటే నిర్మాతలు ప్లానింగ్ పరంగా వెనకా ముందు ఆడుతున్నట్టు గా ప్రచారం అవుతోంది. వెంకీమామ రిలీజ్ డైలమా నుంచి బయటకు వచ్చి అధికారికం గా మళ్లీ పోస్టర్ వేస్తే కానీ ఆ సంశయం అభిమానుల్ని వదిలి పెట్టదు. మరి పీపుల్స్ మీడియా-సురేష్ ప్రొడక్షన్స్ బృందం ఏం చేయబోతోందో?
Please Read Disclaimer