వైరల్: RRR షూటింగ్ లొకేషన్ వీడియో క్లిప్

0

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’ షూటింగ్ ప్రస్తుతం విశాఖ మన్యంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. విశాఖ ఏజెన్సీ ఏరియాలోని డల్లాపల్లి.. మోదాపల్లి మండలాల్లోని కాఫీ తోటలలో ఈ క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరణ జరుపుతున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ షూటింగ్ లోకేషన్ నుండి ఒక క్లిప్ లీక్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇరవై మూడు సెకన్ల నిడివి ఉన్న ఈ లీక్ వీడియోలో మొదట లాల్చీ లాంటి పొడవాటి నలుపు చొక్కా.. ధోతి.. నడుముకు తువ్వాలు.. తలకు తలపాగా ధరించిన ఎన్టీఆర్ దర్శకుడు రాజమౌళి చెప్పిన సూచనను శ్రద్ధగా విన్నాడు. ఆ తర్వాత రాజమౌళి పక్కకు వెళ్ళడం.. ఎన్టీఆర్ ఏదో మాట్లాడుతూ ఉండడం కనిపిస్తోంది. ఈ వీడియోలో యంగ్ టైగర్ లుక్ సూపర్ గా ఉంది. ఆ డ్రెస్.. గడ్డం చూస్తే ఎవరైనా ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లిపోవాల్సిందే. ఈ వీడియోలో ఎన్టీఆర్ చుట్టూ కొందరు మన్యం మహిళలు.. RRR టీమ్ మెంబర్స్ కూడా కనిపిస్తున్నారు.

జక్కన్న అండ్ కో ఈ లీక్స్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. షూటింగ్ లొకేషన్ కు ఎలక్ట్రానిక్ పరికారాలు తీసుకురానివ్వకుండా ఆంక్షలు విధించినప్పటికీ ఇలా షూటింగ్ లొకేషన్ నుంచి వీడియో లీక్ కావడం ఆందోళన కలిగించే పరిణామమే. అయితే దీనితో సంబంధం లేకుండా ఈ వీడియో ను చూసిన సాధారణ ప్రేక్షకులు మాత్రం థ్రిల్ అవుతున్నారు. ఇక ఈ సినిమా ముందుగా ప్రకటించిన విధంగానే వచ్చేఏడాది జులైలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ప్రమోషన్స్ ఆరంభం అయితే గానీ ఈ ఎన్టీఆర్.. రామ్ చరణ్ గెటప్పులు.. ఇతర విశేషాలు మనకు అధికారికంగా తెలియవు.
Please Read Disclaimer