ఫ్యాన్స్ కి ట్రీట్.. విరుష్క స్పైసీ దీపావళి

0

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ – అనుష్క శర్మ జోడీ అనుబంధం గురించి చెప్పాల్సిన పనిలేదు. సెలబ్రిటీ ప్రపంచంలోనే విరుష్కది ప్రత్యేక స్థానం. ప్రపంచవ్యాప్తంగా అసాధారణ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు డిజైనర్ లుక్ తో ట్రెండింగ్ లో నిలుస్తారు. తాజాగా దీపావళి సందర్భంగా ఈ జంట మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. పండగకు తగ్గట్టే డిజైనర్ లుక్ లో ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీటిచ్చింది ఈ జోడీ.

విరాట్-అనుష్క జోడీ ట్రెడిషనల్ లుక్ ఆకట్టుకుంది. ఆ ఇద్దరూ ఎంతో సంబరంగా ఆనందంగా ఉన్న సందర్భమది. విరాట్ అనుష్క నవ్వులు చిందిస్తూ ఒకరి కౌంగిలిలో ఒకరు లీనమయ్యారు. ఇంతలోనే కెమెరా క్లిక్ మంది. వైట్ కలర్ షర్ట్ లో కొహ్లీ- బ్లాక్ రోజ్ కలర్ ఫ్లోరిష్ జాకెట్ లో అనుష్క ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోకి కామెంట్లతో ఫ్యాన్స్ వేడెక్కిస్తున్నారు. టీమిండియాలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. రహనే తండ్రులైన తర్వాత జరుపుకున్న తొలి దీపావళి ఇదే కావడం విశేషం.

ఇటీవలే ఇండియన్ టీమ్- దక్షణాఫ్రికాను క్లీన్ స్వీప్ చేసి టెస్ట్ ల్లో స్థానాన్ని మరింత మెరుగు పరుచుకుంది. ఇక అనుష్క గతేడాది నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. జీరో తర్వాత అమ్మడు మరో సినిమాకు కమిట్ అవ్వలేదు. ఎక్కువ సమయాన్ని విరాట్ తోనే గడుపుతోంది. ఈ నేపథ్యంలో ఈ జంటపై రకరకాల కథనాలు వస్తున్నాయి.
Please Read Disclaimer