Mr అండ్ Mrs కోహ్లి కేరాఫ్ సినిమా

0

మన భారతదేశంలో యువతరం ఎక్కువగా ఫాలో అయ్యే క్రేజీ సెలబ్రిటీ కపుల్ విరాట్ కోహ్లి-అనుష్క శర్మ. క్రికెట్ లో విరాట్ కోహ్లి సామర్థ్యం.. గురించి స్టార్ డం.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక అనుష్క ఏమీ తక్కువ కాదు.. ముగ్గురు ఖాన్లతో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన రికార్డు అనుష్క సొంతం. అందుకే ఈ జంటకు భారీగా అభిమానులున్నారు.

విరాట్ కనుక తన ఇన్స్టా ఖాతాలో ఒక్క ఫోటో పోస్ట్ చేస్తే మిలియన్ల కొద్ది లైక్స్ వస్తాయి. తాజాగా విరాట్ తన అలాంటి తన ముద్దుల భార్యతో కలిసి ఉన్న ఒక ఫోటో పోస్ట్ చేసి “నిన్న రాత్రి. ఈ అందమైన భామతో కలిసి సినిమా చూస్తున్నా” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ క్యాప్షన్ కు తోడుగా ఒక లవ్ ఎమోజి.. అనుష్క శర్మ పేరు కూడా జోడించాడు. విరాట్ తీసిన ఈ సెల్ఫీలో సతీమణి అనుష్క యమా హాటుగా కనిపించింది. భర్త సెల్ఫీకి ఎంతో కూల్ గా పోజిచ్చింది. సన్నటి అరనవ్వు నవ్వింది. ఇక విరాట్ అయితే ఎంతో సంతోషంగా నవ్వుతూ తన సెల్ఫీని తనే కలర్ ఫుల్ గా మార్చాడు. విరాట్ ‘టెక్నో’ అని రాసి ఉన్న ఒక డెనిమ్ షర్టు ధరించి క్యాజువల్ లుక్ లో ఉండగా అనుష్క శర్మ మెంతిరంగు టాప్ లో సూపర్ హాటీలాగా కనిపించింది.

ఈ ఫోటోకు ఇప్పటికే 3 మిలియన్ లైక్స్ వచ్చాయి. కామెంట్లకు లెక్కే లేదు. “విరుష్క వుయ్ లవ్ యూ” అని ఒకరంటే.. “ఈ ప్రపంచంలో ఉత్తమ జంట” అని మరొకరు పొగడ్తలు కురిపించారు. కొందరేమో “ఏ సినిమా చూస్తున్నారు?” అంటూ వివరాలు కనుక్కోవాలని ప్రయత్నించారు. ఇదంతా చూస్తుంటే వివాహం కాకముందు ఉన్న క్రేజ్ కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువైనట్టుగా ఉంది!




Please Read Disclaimer