2019లో జీరో అయిపోయిన అనుష్క

0

న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా సెలబ్రిటీల విదేశీ విహారం గురించి తెలిసిందే. విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ జంట స్విట్జర్లాండ్ లో వాలిపోయారు. డిసెంబర్ 31 వేడుకల్ని ఈ జంట ప్రత్యేకంగా జరుపుకుని అక్కడి మంచు కొండల్ని అధిరోహించి ప్రకృతి అందాల్ని తనివితీరా ఆస్వాదించారు. దానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులకు ఆ ఇద్దరూ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా విరాట్ కోహ్లీ తనదైన శైలిలో చిలౌట్ మూవ్ మెంట్ ని ప్రకటించగా .. అనుష్క శర్మ హబ్బీకి ఓ హగ్ ఇచ్చి…ఫ్యాన్స్ కి విషెస్ తెలిపింది.

మరో రెండు మూడు రోజులు స్విస్ లోనే ఎంజాయ్ చేసి అటుఐ ముంబైకి తిరిగి వస్తారట. ఇక విరాట్ ఇటీవలే భారత్ కు ఇటీవల అజేయమైన విజయాల్ని అందిస్తున్నారు. మొన్నటికి మొన్న వన్డే- టెస్ట్- టీ-20 కప్ లను అందించిన సంగతి తెలిసిందే. వెస్టీండీస్ తో సిరీస్ ముగిసిన వెంటనే విరాట్ భార్యతో స్వీస్ కి చెక్కేసాడు. ఇక అనుష్క కెరీర్ పరిశీలిస్తే.. గతేడాది కనీసం ఒక్క సినిమా కూడా చేయలేదు. జీరో తర్వాత పూర్తిగా సమయాన్ని హబ్బీ కోసమే కేటాయించింది. ఈ నేపథ్యంలో అనుష్క తల్లి కాబోతుంది. అందుకే ఈ గ్యాప్ అన్న ప్రచారం వెడెక్కించింది. కానీ కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టినా విరుష్క జోడీ ఆ స్వీట్ న్యూస్ మాత్రం ఇంకా చెప్పలేదు ఎందుకనో.

మరి ఏడాది గ్యాప్ భర్త కోసమేనా? లేక మరేదైనా కారణం ఉందా? అన్నది తెలియాల్సి ఉంది. అలాగే అమ్మడి 2020 ప్లాన్స్ కూడా ఇప్పటివరకూ ఎక్కడా రివీల్ చేయలేదు. సినిమాలు చేస్తుంది అన్న రూమర్లు సైతం వినిపించలేదు. మరి ఈ ఏడాది కూడా గతేడాదిలానే హబ్బీ కోసమే సమయం కేటాయిస్తుందా ? లేదూ కెరీర్ పై దృష్టి సారిస్తుందా? అన్నది చూడాలి. ఏదేమైనా స్విస్ టూర్ తర్వాత వీటన్నింటిపైనా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Please Read Disclaimer