టెస్టు సిరీస్ కు ముందు విరుష్క విహారయాత్ర

0

న్యూజిలాండ్ లో పర్యటిస్తున్న టీం ఇండియా ఇప్పటికే టీ20 సిరీస్ మరియు వన్డే సిరీస్ లను పూర్తి చేసుకుంది. అయిదు టీ20 ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి గెలుచుకున్న టీం ఇండియా మూడు వన్డేల సిరీస్ ను మాత్రం క్లీన్ స్వీప్ ఓటమితో చేజార్చుకుంది. ఇక చివరి గా టెస్టు సిరీస్ త్వరలో ప్రారంభం కాబోతుంది. టెస్టు సిరీస్ ఆరంభం కు ముందు టీం ఇండియా ఆటగాళ్లు విహార యాత్రకు వెళ్లారు.

ఇన్ని రోజులు వరుస గా క్రికెట్ ఆడుతూ వచ్చిన టీం ఇండియా ఆట గాళ్లు న్యూజిలాండ్ లోని బ్లూస్ప్రింగ్స్ ప్రాంతంలో వాకింగ్ చేశారు. టీం ఇండియా సభ్యులు మొత్తం కూడా ఈ వాకింగ్ లో పాల్గొని ఎంజాయ్ చేశారు. టీం మేనేజ్ మెంట్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఇక ఈ వాకింగ్ లో విరాట్ కోహ్లీతో పాటు ఆయన భార్య అనుష్క కూడా ఉంది. అనుష్క.. విరాట్ లతో కలిసి దిగిన ఫొటోను షమి సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు.

టీం ఇండియా ఆటగాళ్ల విహార యాత్ర కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ కూడా షేర్ చేసింది. టెస్టు సిరీస్ కు ముందు చిన్న విహార యాత్రను టీం ఇండియా ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తున్నారంటూ బీసీసీఐ పేర్కొంది. విహార యాత్రను ఎంజాయ్ చేయడం బాగానే ఉంది కాని వన్డే సిరీస్ మాదిరి గా టెస్టు సిరీస్ ను చేజార్చుకోవద్దంటూ కోహ్లీ సేనకు నెటిజన్స్ చురకలు అంటిస్తున్నారు.
Please Read Disclaimer