వివాహ వార్షికోత్సవం: శ్రీమతికి ఓ బహుమతి

0

భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. ఆయనకు తన సతీమణి అనుష్క శర్మ అంటే వల్లమాలిన ప్రేమ. నిన్న విరాట్ – అనుష్క జంట తమ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. వెడ్డింగ్ యానివర్సరీ అంటే వివాహమై భాగస్వామి ఉన్న ఎవరికైనా ఒక ప్రత్యేకమైన సందర్భమే కదా. అందుకే నిన్న వెస్ట్ ఇండీస్ టీం పైభారత క్రికెట్ టీమ్ సాధించిన విజయాన్ని విరాట్ తన వైఫ్ కు అంకితం ఇచ్చాడు.

వెస్ట్ ఇండీస్ టీమ్ పై సీరీస్ గెలిచి మరోసారి భారత క్రికెట్ టీమ్ సత్తా చాటారు. కెప్టెన్ గా అది విరాట్ కెరీర్ లో ఇదో అద్భుత విజయం. నిన్నటి మ్యాచ్ లో విరాట్ కేవలం 29 బంతుల్లో 70 పరుగులు సాధించి క్రికెట్ ప్రేమికులను మెప్పించాడు. ఇక అద్భుత విజయాన్ని తన సతీమణికి అంకితం ఇవ్వడంతో నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపించారు. ఈ జంటకు యానివర్సరీ విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్స్ కూడా ట్రెండింగ్ చెయ్యడం విశేషం.

విరాట్-అనుష్కల వివాహమై ఇప్పటికి రెండేళ్ళయింది. ఇంకా ఇద్దరూ వివాహానికి ముందు ఎలా ఉన్నారో అలానే ఉంటూ ఒకరిపై ఒకరు ప్రేమ కురిపించుకుంటూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకుంటున్నారు. విరుష్క జంట ఇలానే నూరేళ్ళు చల్లగా ఉండాలని మనమూ కోరుకుందాం.
Please Read Disclaimer