విశాల్- అనీషా పెళ్లి క్యాన్సిల్ కాలేదు-జీ.కె.రెడ్డి

0

హీరో విశాల్ రెడ్డి తాను ప్రేమించిన అనీషా రెడ్డిని పెళ్లాడేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ జంట నిశ్చితార్థం పూర్తయింది. అయితే ఆ తర్వాత విశాల్ రకరకాల గొడవల్లో ఇరుక్కోవడం ఇబ్బంది పెట్టింది. నడిగర సంఘం భవంతి నిర్మించాకే పెళ్లాడతానని సవాల్ చేసిన విశాల్ అందుకోసం వెయిట్ చేశాడు. ఆ క్రమంలోనే అనీషాతో విశాల్ పెళ్లి రద్దయ్యిందంటూ ప్రచారమైంది. సోషల్ మీడియాలో నిశ్చితార్థ ఫోటోలు సహా వారి సాన్నిహిత్యానికి సంబంధించిన ఫోటోల్ని తొలగించడంతో అంతా సందేహం వ్యక్తం చేశారు. అయితే దీనిపై ఇరు కుటుంబాల్లో ఎవరూ అధికారికంగా వివరాలు వెల్లడించలేదు. దీంతో రద్దయ్యిందా లేక జరుగుతుందా? అన్నదానిపై క్లారిటీ రాలేదు.

తాజాగా ‘దమయంతి’ సినీప్రమోషన్స్ లో విశాల్ తండ్రి జీ.కే.రెడ్డి దీనిపై వివరణ ఇచ్చారు. విశాల్ నడిగర సంఘం భవంతి నిర్మిస్తాడు. కోర్టు కేసులు తేలితే నడిగర సంఘం ఎన్నికల్లో గెలిచేది మా వాడే.. అంటూ విశాల్ తండ్రి ధీమాను వ్యక్తం చేశారు. భవంతి కడతాడు.. పెళ్లాడతాడు! అంటూ తనయుడిపై ధీమాను వ్యక్తం చేశారు. అనీషాతో విశాల్ పెళ్లి రద్దయ్యిందన్న దాంట్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. విశాల్- అనీషా పెళ్లి నిర్ణయించిన ప్రకారం జరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో కట్టు కథనాలు నమ్మొద్దని… పెళ్లి తేదీని నిర్ణయించాక వెల్లడిస్తామని అన్నారు. పెళ్లి మాత్రం కచ్చితంగా నడిగర్ సంఘం నూతన భవనంలో నే జరుగుతుందని .. ఎన్నికలు ఓట్ల లెక్కింపును కోర్టు నిలిపివేసిందిని.. ఫలితాలు వస్తే నడిగర సంఘం భవంతి నిర్మాణం పూర్తి చేస్తాడని ఎంతో ధీమాను వ్యక్తం చేశారు.

తెలుగు వాడైన విశాల్ నడిగర సంఘం సహా తమిళ నిర్మాతల మండలిలో ఆధిపత్యం చెలాయించడం అరవతంబీలకు కంటగింపుగా మారిన సంగతి తెలిసిందే. విశాల్ పరాయి వాడు అంటూ తొలి నుంచి అక్కడి జనం చెత్త రాజకీయాలు చేస్తూ అతడిపై ఏవగింపును పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పొలిటికల్ గేమ్ లో విశాల్ పై రకరకాల దాడులు జరిగాయి. మరి సవాల్ విసిరినట్టే అన్ని కేసులు-గొడవల నుంచి బయటపడి నడిగర్ సంఘం భవంతిని నిర్మిస్తాడా లేదా? తాను వలచిన అందగత్తెను మనువాడతాడా లేదా? అన్నది చూడాలి.
Please Read Disclaimer