విశాల్ ‘చక్ర’ టీజర్ : సైబర్ క్రైమ్ థ్రిల్లింగ్

0

వినూత్నమైన కథలను ఎంచుకొని హిట్స్ కొడుతున్న కోలీవుడ్ హీరో విశాల్ తాజాగా ‘చక్ర’ సినిమాతో అలరించబోతున్నాడు. అభిమన్యుడు చిత్రంతో హిట్ కొట్టిన విశాల్ తాజా చిత్రాన్ని హ్యాకింగ్ నేపథ్యంలోని సైబర్ నేరాలపై ఈ కొత్త మూవీ తీస్తున్నాడు. విశాల్ హీరోగా ఎంఎస్ ఆనందన్ బాలసుబ్రహ్మణ్యం దర్శకత్వంలో తీస్తున్న ఈ ‘చక్ర’ మూవీ ట్రైలర్ గ్లింప్స్ విడుదలైంది. ట్రైలర్ గ్లింప్స్ తోనే విశాల్ ఆకట్టుకున్నాడు. సైబర్ క్రైమ్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ట్రైలర్ వీడియో చూస్తే అర్థమవుతోంది. వినూత్నంగా తీసిన ఈ వీడియోకు మంచి స్పందన వస్తోంది. అరనిమిషం నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో హీరో విశాల్ పవర్ ఫుల్ గా కనిపించాడు.

తన గత చిత్రం అభిమన్యుడు తరహాలోనే బ్యాంక్ రాబరీ సైబర్ క్రైమ్ నేపథ్యంలోనే ఈ సినిమా కూడా ఉండబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అత్యాధునిక సాంకేతిక విలువలతో ఈ చిత్రం తీస్తున్నట్టు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. వీడియోలో రౌడీలకు ఎదుట దుమ్మును దులుపుతున్న విశాల్ లుక్ ఊరమాస్ గా కనిపించింది.

ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ – రెజీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. యువన్ శంకర్ సంగీతం అందిస్తున్నాడు. విశాల్ సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer