భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం - LIVE

దర్శకుడి కండిషన్లతో హీరోకు చుక్కలు

0

దర్శకుడు హీరో మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తితే ఆ ప్రాజెక్ట్ ఎటో వెళుతుంది. ఇంతకుముందు హీరోలు దర్శకుల్ని పక్కన పెట్టి తామే కెప్టెన్ సీటును అధిరోహించి చేతులు కాల్చుకున్న సందర్భాలే ఎక్కువ. మణికర్ణిక విషయంలో కంగన రనౌత్ .. నోటా విషయం లో దేవరకొండ ఇలానే చేశారన్న ముచ్చట అప్పట్లో సాగింది. ఇప్పుడు విశాల్ కూడా `డిటెక్టివ్ 2` విషయంలో అలానే ఘర్షణ పడుతున్నాడా?

దర్శకుడు మిస్కిన్ తో నిరంతరం గొడవ పడుతూ ఈ ప్రాజెక్టును డైలమాలో పడేస్తున్నాడా? అంటే అవుననే ప్రచారమవుతోంది. తొలుత చెప్పిన బడ్జెట్ కి అదనంగా మరో 40 కోట్లు వెచ్చించాల్సిందిగా మిస్కిన్ డిమాండ్ చేయడంతో విశాల్ కి చిర్రెత్తుకొచ్చిందట. ఇప్పటికే మిస్కిన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అతడిని తప్పించి విశాల్ స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారు. అయితే కొన్ని కండిషన్లపై మిస్కిన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని సమాచారం. ఆ కండిషన్లు ఏమిటి? అంటే..

తనకు 5 కోట్ల మేర జీతం చెల్లించాలి. ఇప్పటికే లండన్ లో భారీ షెడ్యూల్ తెరకెక్కించారు కాబట్టి తనతో పాటు స్టాఫ్ కి పేమెంట్లు పూర్తిగా ఇవ్వాలి. 5 కోట్ల పారితోషికం హిందీ రీమేక్ రైట్స్ తనకే చెల్లుతాయని హామీ ఇవ్వాలి. ఆఫీస్ ఖర్చులు వగైరా వగైరా అన్నీ నిర్మాత కం హీరో విశాల్ స్వయంగా బేర్ చేయాల్సిందే. ఇక డిటెక్టివ్ 2 (తుప్పరివాలన్ 2) తర్వాత తీసే సీక్వెల్స్ పై విశాల్ కి ఏ రైట్స్ ఉండవు. అవన్నీ మిస్కిన్ కే చెందుతాయి. ఈ సినిమా థీమ్ ని కానీ.. క్యారెక్టర్లను కానీ ఎక్కడా ఉపయోగించకూడదు. అంతేకాదు.. ఈ సినిమాకి ఉపయోగించే లొకేషన్లు ఏవి అన్నదానికి తన అనుమతి తప్పనిసరి అంటూ రకరకాల కండిషన్లు పెట్టాడట. ఇక బడ్జెట్ వ్యవహారం లో తనకు ఏమాత్రం సంబంధం లేదని అతడు ప్రామిస్ తీస్కున్నాడు. మొత్తానికి విశాల్ కి కళ్లు భైర్లు కమ్మే కండిషన్లే పెట్టాడని భావించాల్సి ఉంటుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-