విశాల్.. ఒకే సారి రెండు సీక్వెల్స్!

0

ఇప్పటికే తన ఒక సినిమా కు సీక్వెల్ చేశాడు విశాల్. పందెంకోడి పార్ట్ టూ చేశాడు. అయితే ఆ సినిమా అంత గా ఆకట్టుకో లేదు. ఆ సంగతలా ఉంటే.. విశాల్ చేతి లో ఇప్పుడు రెండు సీక్వెల్స్ ఉండటం విశేషం. హిట్టైన రెండు సినిమాలకు ఒకేసారి సీక్వెల్స్ చేస్తున్నాడు ఈ హీరో.

విశాల్ హీరో గా కొన్నాళ్ల కిందట వచ్చి విజయాన్ని నమోదు చేసుకున్న సినిమాలు రెండున్నాయి. అవి ఒకటి ‘డిటెక్టివ్’ రెండు ‘అభిమన్యుడు’. డిటెక్టివ్ సినిమా పేరు కు తగ్గట్టైనదే. డిటెక్టివ్ సినిమాలకు సీక్వెల్స్ కు మంచి అవకాశం ఉంటుంది. తొలి పార్ట్ హిట్ కావడం తో రెండో పార్ట్ కు అవకాశం ఏర్పడింది.

ప్రస్తుతం ఆ సినిమా మేకింగ్ దశ లో ఉంది. డిటెక్టివ్ టూ రెడీ అవుతూ ఉంది. తొలి వెర్షన్ కు దర్శకత్వం వహించిన మిష్కిన్ రెండో పార్ట్ ను కూడా తీర్చి దిద్దుతున్నాడు. ఆ సంగతలా ఉంటే.. సైబర్ మోసాలపై వచ్చిన ‘అభిమన్యుడు’ సినిమా కు కూడా విశాల్ సీక్వెల్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ ఫ్రాడ్స్ పై వచ్చిన చక్కని సినిమా ‘అభిమన్యుడు’.

అర్జున్ ఆ సినిమా లో విలన్ గా నటించాడు. కమర్షియల్ గా ఆ సినిమా విజయ వంతం అయ్యింది కూడా. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు విశాల్. దానికి ‘చక్ర’ అని టైటిల్ ను ఖరారు చేసినట్టు గా సమాచారం.
Please Read Disclaimer