యోగాలో నడుము అందాలతో మనసులు మెలేసిన బుల్లితెర బ్యూటీ!

0

బుల్లితెర బ్యూటిఫుల్ యాంకర్ విష్ణుప్రియ అంటే యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. ‘పోవే పోరా’ టీవీ కార్యక్రమంతో పాపులర్ అయిన విష్ణుప్రియ.. మోడలింగ్ చేస్తూ టెలివిజన్ స్క్రీన్ మీదకి ప్రవేశించింది. ఈ యాంకరమ్మ సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటుంది. ఎల్లప్పుడూ ఫోటో షూట్లు చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటోంది. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా తన యాంకరింగ్ చేస్తోన్న కార్యక్రమాలకు బ్రేక్ పడటంతో మొన్నటి వరకు ఇంటికే పరిమితం అయింది విష్ణు. ఇక లాక్ డౌన్లో ఖాళీగా ఉండకుండా తనలోని టాలెంట్స్ అన్నీ బయటికి తీస్తోంది. ఇటీవలే ఈ భామ ఓ పాప్ సాంగ్కు అదిరిపోయే డాన్స్ వేసి అదరగొట్టింది.

దానికి సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. ఆ వీడియోలో విష్ణుప్రియ తన నడుమును సాంగ్ బీట్కు తగ్గట్లు ఊపుతూ వయ్యారంగా అదరగొట్టింది. ఇక తాజాగా యాంకర్ అమ్మడు మరో వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో విష్ణు ప్రియ యోగా చేస్తూ కనిపించి.. కుర్రకారు మతులు పోగొట్టిందని చెప్పాలి. ఇక ఆ వీడియోలో యోగాతో పాటు విష్ణుప్రియ అందాలను అదేవిధంగా ఆరబోసింది. ముఖ్యంగా ఈ భామ నడుము అందాలు.. నాభి అందాలు.. శరీరాన్ని మెలికలు తిప్పుతూ యూత్ మనసులను కూడా మెలేసింది ఈ బుల్లితెర బ్యూటీ.

Login * Instagram

Welcome back to Instagram. Sign in to check out what your friends, family & interests have been capturing & sharing around the world.


అంతేగాక ‘‘మీ అంతరాత్మ గురించి తెలుసుకోండి. యోగా మీ అంతరాత్మను అర్థం చేసుకోవడానికి సహకరిస్తుంది. రోజు రోజుకి మీ ప్రపంచాన్ని వ్యాప్తి చేస్తుంది. యోగా వల్ల మీరు మీ సామర్థ్యాన్ని తెలుసుకోగలుగుతారు. మీ అంతరాత్మలో ఏముందో తెలుసుకోగలరు. యోగా చేయండి.. ఆ అనుభూతిని ఆస్వాదించండి’’ అని వీడియోలో తెలిపింది. అమ్మడి అందాలకు కామెంట్స్ వర్షం కురుస్తోంది. అందులో నెగటివ్ కూడా ఉన్నాయనుకోండి. యోగా చేస్తే అందాలు ఆరబోయాలా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజమే కదా.. అంటున్నారు విశ్లేషకులు.
Please Read Disclaimer