కల్నల్ సంతోష్ బాబు ఫ్యామిలీని పరామర్శించిన టాలీవుడ్ యంగ్ హీరో

0

లడఖ్ సరిహద్దులోని గాల్వాన్ వ్యాలీలో చైనా సైనికులతో జరిగిన పోరాటంలో వీరమరణం పొందిన సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్ బాబుకి దేశవ్యాప్తంగా నివాళులు అర్పించారు. మన తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశాడని తలచుకొని ప్రతి పౌరుడూ గర్వంగా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు. సూర్యాపేట వెళ్లి సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సంతోష్ బాబు లాంటి వీరుపుత్రుడిని దేశానికి అందించిన ఆయన తల్లికి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ”సంతోష్ బాబు కుటుంబం చేసిన త్యాగం కేవలం మన ఒక్కరి కోసం కాదు. మన రాష్ట్రం కోసం కాదు. మన భారత దేశం కోసం చేసిన త్యాగం. ఆర్మీకి మనం రుణపడి ఉండాలి. అందుకే సంతోష్ బాబు తల్లిని ఒకసారి కలుసుకోవాలని అనిపించింది. కనీసం నేను ఆ తల్లిని సందర్శించి మన సంతోష్ బాబును దేశం కోసం త్యాగం చేసిన ఆమెకు కృతజ్ఞతలతో పాటు సంతాపాన్నీ తెలపగలిగాను. పూడ్చలేని లోటు నుంచి కోలుకొని మన వీర సైనికుల కుటుంబాలకు ఆత్మ స్థైర్యం లభించాలని ప్రార్థిద్దాం. జైహింద్” అని చెప్పుకొచ్చారు. ఈ పో

రాటంలో సంతోష్ బాబుతో పాటు వీరమరణం పొందిన 19 మంది సైనికులకు నివాళులు అర్పిస్తున్నారు.
Please Read Disclaimer