వర్మ.. విశ్వక్ కోకోనట్ వాటర్ పార్టీ!

0

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ గురించి ఒక పాపులర్ కొటేషన్ ఉంది.. “మీకు ఆయనంటే ఇష్టం ఉండొచ్చు.. ఇష్టంలేకపోనూవచ్చు అయితే ఆయనను మాత్రం మీరు విస్మరించలేరు”. ఈ కొటేషన్ మన రామ్ గోపాల్ వర్మకు సరిగ్గా సరిపోతుంది. అందుకే మీరు ఎలాగైనా ఆయన న్యూసు చదవకుండా ఉండలేరు. అదే అయన స్పెషాలిటి. ఇండస్ట్రీలోకి ఎంతమంది వచ్చినా వర్మ తీర్థం పుచ్చుకోకుండా ఉండలేరు.

తీర్థం అనగానే మీరు నీటిలాగా ఉండే వోడ్కా అని ఫిక్స్ అయిపోకండి. ఎందుకంటే ఈమధ్య ఆర్జీవీ కోకోనట్ వాటర్ తాగుతున్నారట. అఫ్ కోర్స్.. లుక్ వైజ్ కొబ్బరినీరు వోడ్కాకు కజిన్ లాగానే ఉంటుంది. తాజాగా వర్మగారితో ‘ఫలక్ నుమాదాస్’ తో ఎంతో హంగామా చేసిన విశ్వక్ సేన్ జాయినయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్జీవి తన ఇన్స్టా ఖాతా ద్వారా వెల్లడించాడు. ఆర్జీవీ ఒక ఫోటో పోస్ట్ చేసి “సెక్సీలీ సూపర్ టాలెంటెడ్ #విశ్వక్ సేన్ తో కొబ్బరినీరు సేవిస్తున్న నేను” అంటూ ఎంతో సాఫ్ట్ గా క్యాప్షన్ ఇచ్చారు. వర్మ గారి చేతిలో గ్లాసు ఉంది. ఇక ఇద్దరి కళ్ళలో కోకోనట్ వాటర్ సేవించినప్పుడు కలిగే మెరుపు కనిపిస్తోంది. నిజమే.. కొబ్బరినీరు ఆరోగ్యానికి ఎంతో మంచిది..!

అయితే ఈ విషయాన్ని ఒక్కరంటే ఒక్కరు నమ్మితే ఒట్టు. అందుకే నెటిజన్లు తమ కామెంట్లతో రచ్చలేపారు. “అది వోడ్కా సర్”.. “ఓహో వోడ్కా లో కోకోనట్ కలిపారా గురూ?”.. “ఏ బార్ లో కోకోనట్ వాటర్ దొరుకుతుంది చెప్పండి.. మేమూ ట్రై చేస్తాం”.. “కోకోనట్ వాటర్ లో లెమన్.. మరీ సిల్లీగా మాట్లాడకండి రాము. ఈ టైం లోమీ చేతిలో ఏమి ఉంటది? జస్ట్ ఆస్కింగ్”.. “చాలాకాలానికి మీకు సరైన శిష్యుడు దొరికాడు” అన్నారు. ఈలెక్కన ఒక్కరు కూడా నమ్మడం లేదు. ఏంటో మాయదారి లోకం.. వోడ్కా గురించి తెలియని మనిషే లేరు. అయితే అందరి ఇళ్ళలో పెద్దవారు మాత్రం వారి పిల్లలు శుద్ధపూసలని నమ్ముతుంటారు. కోకోనట్ వాటర్ తాగుతూ ఉంటారని తమ మనసులకు సర్ది చెప్పుకుంటూ ఉంటారు.Please Read Disclaimer