దాసూ నీ రేంజే వేరు కదా!

0

నటించిన తొలి సినిమాతోనే ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. ఫలక్ నుమా దాస్ గా నైజాం యాసతో అదరగొట్టాడు. పరిమిత బడ్జెట్ సినిమాలకు విశ్వక్ ఒక ఆప్షన్ అని నిరూపణ అయ్యింది. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా నటుడిగా పలువురి ప్రశంసలు అందుకున్న విశ్వక్ కి రెండో ఛాన్స్ ఇచ్చేందుకు కొందరు నిర్మాతలు సిద్ధమయ్యారు. నేచురల్ స్టార్ నాని సొంత బ్యానర్ లో ఓ ఆఫర్ ఇచ్చారు. సుకుమార్ లాంటి దర్శకుడు సుకుమార్ రైటింగ్స్ లో ఓ ఆఫర్ ఇచ్చారని ప్రచారమైంది. అలాగే డి.సురేష్ బాబు కాంపౌండ్ నుంచి పరిమిత బడ్జెట్లో ఆఫర్ ఉందన్న గుసగుసలు వినిపించాయి.

విశ్వక్ ప్రస్తుతం కెరీర్ పరంగా ప్రణాళికలతో బిజీగా ఉన్నాడు. అలాగే సామాజిక మాధ్యమాల్లో తన అభిమానులకు నిరంతరం ఏదో ఒక కొత్త విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా అతడు ఓ రేంజ్ రేవర్ కార్ ని ఫ్యాన్స్ కి షేర్ చేసి ఆసక్తికర వ్యాఖ్యను దానిపై జోడించాడు. ”విమర్శ ఎదుర్కోక ముందే నువ్వు ప్రశంసలు పొందేంత గొప్పవాడివి కాలేవు!” అంటూ ఆసక్తికర వ్యాఖ్య కనిపించింది. మొత్తానికి విశ్వక్ తనలోని ఎమోషన్ ని ఈ రూపంలో చెబుతున్నాడని అర్థమైంది. అయినా విశ్వక్ రేంజు మామూలు రేంజేమీ కాదు. రేంజ్ రోవర్ రేంజు. అతడిలో అంత మ్యాటర్ ఉందనడంలో సందేహం లేదు.

యువ హీరో విశ్వక్ సేన్ గురించి ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పుకోవాలి. తను సినిమాల్లోకి రాకముందు సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్. సినిమాల్లో పెట్టుబడులు పెట్టాడు. ఆ తర్వాతే హీరో అయ్యాడు. ఇప్పుడు రేంజ్ రోవర్ ని సొంతం చేసుకోవాలనే తన కల సునాయాసంగానే నెరవేరింది. ‘ఫలక్నుమాదాస్’ సినిమాతో అభిమానుల్ని సంపాదించుకున్న విశ్వక్ సేన్ తన రేంజ్ రోవర్ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఆ ఖరీదైన కార్ ని చూసిన ఫ్యాన్స్ అంతే ధీటుగా స్పందించారు. నువ్వే కొన్నావ్ లే బ్రో కారూ అంటూ కొందరు.. ‘మాకూ టైమొస్తుందిలే’ అని మరి కొంత మంది ఇన్ స్టాలో రిప్లయ్ లు ఇచ్చారు. దాసూ నీ రేంజే వేరు కదా!
Please Read Disclaimer