బాలీవుడ్ ను వెనక్కినెట్టిన అజిత్ – మహేష్

0

ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ప్రతీ ఏటా తన ఫ్లాట్ ఫామ్ పై ఎక్కువగా వెతికిన పదాల గురించి ట్రెండింగ్ లను చెబుతుంటుంది. ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ లతో ట్రెండ్ అయిన పదం.. వెతికిన పదాన్ని వెల్లడిస్తుంది. ఆ కోవలోనే ఈ సంవత్సరం కూడా భారత దేశవ్యాప్తంగా వైరల్ అయిన పదాలేంటో చెప్పింది.

ఆశ్చర్యకరంగా ఇందులో బాలీవుడ్ లోని ఒక్క సినిమా దర్శకుడు హీరో లేకపోవడం షాక్ కు గురిచేస్తోంది. దేశంలోనే నంబర్ 1 హ్యాష్ ట్యాగ్ గా తమిళ హీరో అజిత్ నటించిన ‘విశ్వాసం’ మూవీ ఉండడం విశేషంగా చెప్పవచ్చు. ఇక రెండో స్థానంలో మేలో జరిగిన ‘లోక్ సభ ఎలక్షన్స్ 2019’ గురించి నెటిజన్లు వెతికారట.. ఇక మూడో హ్యాట్ ట్యాగ్ ‘క్రికెట్ వరల్డ్ కప్’. నాలుగో స్థానంలో మన టాలీవుడ్ హీరో మహేష్ నటించి ‘మహర్షి’ మూవీ ఉండడం విశేషంగా చెప్పవచ్చు. మహర్షి టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ కావడం.. ‘వీకెండ్ అగ్రికల్చర్ ’ పేరిట మహర్షి సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో ఇది వైరల్ అయ్యింది.

ఇలా తొలి నాలుగు స్థానాల్లో ఇద్దరు సౌత్ ఇండియన్ సినిమాల హీరోలు ఉండడం.. బాలీవుడ్ కు సంబంధించిన ఏ సినిమా లేదా విషయం లేకపోవడం విశేషంగా చెప్పవచ్చు.. దీన్ని బట్టి దేశంలో దక్షిణాది సినిమాలు హీరోల ప్రభావం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
Please Read Disclaimer