పునర్నవితో రాహుల్ పులిహోర… పెళ్లి సంబంధం రాదా…

0

బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ పులిహోర బాయ్ ట్యాగ్ కి న్యాయం చేస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి పునర్నవితో బాగా క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు. శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్ లో వితిక పునర్నవి రాహుల్ సిప్లిగంజ్ మధ్య ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకొన్నది. డైనింగ్ టేబుల్ దగ్గర పునర్నవి వితికలు టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఈలోపు రాహుల్ వచ్చి కూర్చున్నాడు.

దీంతో పునర్నవి రాహుల్ కు తినిపించడం మొదలుపెట్టింది. ఇది చూసిన వితిక ఓ కామెంట్ చేసింది. సిగ్గులేదా.. అలా తినడం.. నేను నా మొగుడికే తినిపించడం లేదు అంటూ వితిక అనగానే రాహుల్ నవ్వుతూ పునర్నవి వంక చూశాడు. అయిన రాహుల్.. పునర్నవి చేతి ముద్దలు తింటూ మైమరిచాడు. ఎంత టేస్ట్ గా ఉందో ఈమె తినిపిస్తుంటే అంటూ ఆస్వాదించాడు. మిమ్మల్ని ఇలా చూస్తే మీకు పెళ్లి అవ్వదు అంటూ వితిక చురక అంటించింది.

మీరు ఇలా చేస్తే పుకార్లు వస్తాయి అని వితికా అనడంతో.. అయితే నేనే తింటాలే అని రాహుల్ పునర్నవి ప్లేట్ లో చేయిపెట్టి తింటూ.. ఇది పెద్దగా టేస్ట్ అనిపించడంలేదు. పునర్నవి తినిపిస్తే టేస్ట్ గా ఉందంటూ తనదైన శైలిలో పులిహోర కలిపి పునర్నవిని లైన్ లోకి తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. అంతకముందు వంటగదిలో శ్రీముఖి.. బాబా భాస్కర్ మధ్య వంటనూనె విషయంపై సరదా చర్చ నడిచింది.

సాయంత్రం పూట చపాతీలు కాల్చేటప్పుడు ఎక్కువ నూనె వాడేస్తున్నారని భాస్కర్ క్లాస్ పీకే ప్రయత్నం చేశాడు. గత వారం ఐదు లీటర్ల నూనె ఇచ్చి ఇప్పుడు రెండు లీటర్ల నూనె ఇచ్చారు అంటూ శ్రీముఖి సీరియస్గా రియాక్ట్ అయ్యింది. అటు హిమజ కూడా మేము తినిపిస్తే బాగుందంటూ తిన్నారగా అని బాబా భాస్కర్ ని ఆటపట్టించింది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home