బాబా భాస్కర్ కామెడీ… పునర్నవిపై వితిక ఫైర్..

0

బిగ్ బాస్ షోలో రోజు రోజుకు గొడవలు పెరుగుతున్నాయి. మొన్నటివరకు మిత్రులుగా ఉన్నవారి మధ్య కూడా వాగ్వాదం జరగడం విశేషం. అలాగే వీటి మధ్య బాబా భాస్కర్ కొంచెం కామెడీ కూడా చేసి ఎంటర్టైన్ చేశాడు. గురువారం ఎపిసోడ్ లో మొదలు కావడమే బాబా భాస్కర్..ఇంటి నుంచి వెళ్ళిపోయిన జాఫర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. హౌస్ నుండి వెళ్లిపోవడం మిమ్మల్ని మిస్ అయ్యాం అంటూ శ్రీముఖి కూడా విషెష్ చెప్పారు. ఇక బాబా మాస్టర్.. జాఫర్ 62 సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నారంటూ కొంచెం కామెడీ చేశారు.

ఇక తర్వాత కిచెన్ లో వరుణ్-వితికా మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. గిన్నెలు తోముతున్న వరుణ్ ని అలా కాదని వితికా వారించింది. దీంతో వరుణ్ ‘నువ్ మ్యాన్ హ్యాడ్లింగ్ చేస్తున్నావు. నా పని నేను చేసుకోనియ్యి. నువ్ నా పనిలో ఇన్వాల్వ్ కాకు’ అని గట్టిగానే మాట్లాడాడు. ఇలా మాట్లాడితే నేను కిచెన్ డిపార్ట్మెంట్ నుండి మారిపోతా అంటూ వితికా హెచ్చరించింది. దీనికి తోడుగా పునర్నవి కూడా వెళ్లిపోతే వెళ్లిపో అంది.

కిచెన్ నుండి బయటకొచ్చేసిన వితిక బెడ్ రూమ్ లో పని చేస్తూ… రాహుల్ కి కిచెన్ లో జరిగింది వివరించింది. వంటగదిలో పునర్నవి మరీ ఓవరాక్షన్ చేస్తుందని అలా చేయలి.. ఇలా చేయాలి అని చెప్పడం తనకు నచ్చడం లేదంటూ వితికా అసహనం ప్రదర్శించింది. ఆ తర్వాత బాబా భాస్కర్ మహేశ్ లు బాత్ రూములు దగ్గర క్లీన్ చేస్తుంటే హిమజ శ్రీముఖిలు వెళ్ళి అసలు సరిగా క్లీన్ చేయడం లేదని సరదాగా గొడవపడ్డారు. పైగా కెప్టెన్ అలీని తీసుకెళ్లి ఇక్కడ అలా ఉంది అక్కడ అలా ఉంది అంటూ చూపించారు. అలీ ఏమో వాళ్ళని క్లీన్ చేయనివ్వండి నెక్స్ట్ మాట్లాడుతా అని చెప్పారు.

దీని తర్వాత బాబా భాస్కర్ హౌస్ లో సరిగా క్లీన్ చేయలేదని హిమజ శ్రీముఖిలని సరదాగా టార్గెట్ చేశారు. టేబుల్స్ మీద దుమ్ము చేతితో తీసి కెప్టెన్ అలీకి చూపిస్తూ వాళ్ళని సరదాగా ఏడిపించారు. అలా బాబా భాస్కర్ చాలాసేపు వాళ్ళని ఆటపట్టిస్తూ హౌస్ లో కామెడీ పండించారు.
Please Read Disclaimer