వితికాని మెచ్చుకున్న బాపు… బాబాకు అవకాశం ఇచ్చిన ధనుష్..

0

బుల్లితెర మీద మంచి టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతున్న బిగ్బాస్ ఎండింగ్కు వచ్చేసింది. హౌస్లో మిగిలిన 7 గురు కంటెస్టెంట్స్ లో ఈ వారం ఒకరు ఎలిమినెట్ కానున్నారు. అయితే గత మూడు ఎపిసోడ్లుగా కంటెస్టెంట్స్ రిలేటివ్స్ ని ఇంటిలోకి తీసుకొచ్చిన బిగ్ బాస్…శుక్రవారం ఎపిసోడ్ లో ఇంటి సభ్యుల జీవితంలో ఉన్న ఎత్తు పల్లాలు గురించి వివరించమన్నారు. దీంతో మొదట వితికా వచ్చి తన కెరీర్ గురించి చెప్పింది. తాను మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా సీరియల్స్ చేసానని తర్వాత తాను బాపు గారి సుందరకాండ లో ఓ చిన్న రోల్ చేశానని… అందులో చార్మీ హీరోయిన్గా చేసిందని చెప్పింది.

ఆ తర్వాత హీరోయిన్ పక్కన ఓ సాంగ్ లో పెట్టారని అప్పుడు తాను లంగా ఓణీతో వెళ్లడంతో బాపు గారు తనని చూసి.. చాలా బాగున్నావమ్మా అని చార్మితో ఒక మూమెంట్ పెట్టారని వివరించింది. ఇక అక్కడ నుండి తన మీద తనకు కాన్ఫిడెంట్ పెరిగిందని వరుస సినిమాలు చేసి చివరికి వరుణ్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యానని ఇద్దరం ఇలా కలిసి బిగ్ బాస్ లోకి వచ్చి ఆడటం ఇన్ని వారాలు ఉండటం చాలా గ్రేట్ అని చెప్పుకొచ్చింది.

ఇక వితికా తర్వాత బాబా భాస్కర్ తన లైఫ్ గురించి వివరించారు. నా డ్యాన్స్ టాలెంట్ గుర్తించి మా నాన్న డ్యాన్స్ నేర్పించారని డ్యాన్స్ మీద ఉన్న ఆసక్తితో చదువు పట్టించుకోలేదని అయితే స్కూల్ లో హీరో ధనుష్ తన క్లాస్మేట్ అని అప్పుడు ఇద్దరికీ మనస్పర్థలు వచ్చి విడిపోయామని కానీ నెక్స్ట్ తాను డ్యాన్సర్ ని అయ్యేసరికి ధనుష్ పెద్ద హీరో అయిపోయాడని ఆ సమయంలోనే ధనుష్ సినిమాకు రాజుసుందరం కొరియోగ్రాఫర్ అని ఆయనకు నేను అసిస్టెంట్ అని చెప్పారు.

ఆ తర్వాత ధనుష్…తన సినిమాకు నాకు కొరియోగ్రాఫర్ అయ్యే అవకాశం ఇచ్చారని చెప్పారు. ఇక అలా అలా మంచి కొరియోగ్రాఫర్గా ఎదిగా అని… రజనీ సినిమాకు పనిచేయడం చాలా ఆనందమని చెప్పారు. నెక్ట్స్ శివ జ్యోతి రాహుల్ అలీ వరుణ్ శ్రీముఖిలు తమ లైఫ్ లో ఎలా ఎదిగామో చెప్పుకొచ్చారు.
Please Read Disclaimer