బిగ్ బాస్: వరుణ్-వితిక మధ్య చిచ్చుపెట్టారు

0

బిగ్ బాస్ రెండో వారంలోకి ప్రవేశించింది. మొదటి వారం హేమ ఎలిమినేట్ అయ్యాక అందరూ జాగ్రత్తగా గేమ్ ఆడుతున్నారు. ఇక హేమ స్థానంలో ట్రాన్స్ జెండర్ తమన్నా ఎంట్రీ ఇచ్చాక కంటెస్టెంట్ల మధ్య పుల్లలు పెట్టే పనిలో బిజీగా ఉంది.

అయితే బిగ్ బాస్ ఇంట్లో అందరూ గ్యాస్ కరెంట్ నీటిని వృథా చేస్తున్నందుకు బిగ్ బాస్ ఆగ్రహించాడు. వారిందరికీ వాటిని కట్ చేసి శిక్ష విధించాడు. వాటి విలువ తెలియడం కోసం మూడు సైకిల్స్ ఇచ్చి వాటిని తొక్కడం ద్వారా గ్యాస్ కరెంట్ నీటిని ఉత్పత్తి చేసుకోవాలని ఆదేశించి లగ్జరీ బడ్జెట్ టాస్క్ ను ఇచ్చాడు.

నీళ్లు గ్యాస్ కరెంట్ కట్ కావడంతో యాంకర్ శ్రీముఖి తొలుత సైకిల్ ఎక్కి తొక్కడం ప్రారంభించింది. అయితే టీంలుగా తొక్కుదామని శివజ్యోతి గొడవ పెట్టుకొని రచ్చ చేసింది.

ఇదే సైకిల్ తొక్కే గొడవ బిగ్ బాస్ లోని భార్యభర్తలు వరుణ్ సందేశ్-వితిక మధ్య చిచ్చు పెట్టింది. అందరూ సైకిల్ తొక్కుతుండగా వితిక మాత్రం వంటింట్లో అందరికోసం చపాతీలు రెడీ చేస్తోంది. అందరూ సైకిల్ తొక్కుతున్నారని.. నువ్వు ఇలా వంటగదిలో ఉండడం కరెక్ట్ కాదని.. సైకిల్ తొక్కాలని పునర్నవి కోరింది. దీనికి సీరియస్ అయిన వితిక.. ‘ఖాళీగా ఏం కూర్చోలేదని.. అందరికి వంట చేస్తున్నాంటూ’ పునర్నవిపై ఫైర్ అయ్యింది.

అప్పుడే వచ్చిన భర్త వరుణ్ సందేశ్.. భార్య వితిక తీరును తప్పుపట్టారు. పునర్నవికి సపోర్ట్ గా మాట్లాడారు. ఈ మాటలకు వితిక ఏడ్చేసింది. భార్య మరో అమ్మాయికి సపోర్ట్ చేయడంపై భోరుమంది. దీంతో భార్య భర్తల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. పునర్నవి వారిద్దరి మధ్య చిచ్చు పెట్టింది. తర్వాత ఇద్దరు సారీ చెప్పుకొని కూల్ అయిపోవడం బిగ్ బాస్ 10వ రోజులో హైలెట్ గా చెప్పవచ్చు..
Please Read Disclaimer