బిగ్ బాస్: అప్పుడే వెళ్ళాల్సింది..ఇప్పటివరకు ఉంది..

0

ఎప్పుడు జరిగినట్లే ఈ ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ కార్యక్రమం జరిగింది. తనదైన శైలిలో ఆదివారం ఇంటి సభ్యుల చేత సరదా టాస్కులు చేయించిన నాగార్జున మధ్య మధ్యలో ఎలిమినేషన్ నుంచి ఒకరిని సేఫ్ చేస్తూ వచ్చారు. శనివారం ఎపిసోడ్లో శ్రీముఖి – రాహుల్ – బాబా భాస్కర్ లు సేవ్ అయిన విషయం తెలిసిందే. ఇక నామినేషన్ లో వరుణ్ – అలీ – శివజ్యోతి – వితికా ఉన్నారు. ఆదివారం ఎపిసోడ్ లో నలుగురుకి నాలుగు ముంతలు ఇచ్చి…వాటిని పగలగొట్టమని చెప్పారు. అందులో ఎవరు పేరు ఉంటే వారు సేఫ్ అయినట్లని ప్రకటించారు.

ఆ ముంతల్లో శివజ్యోతి పేరు రావడంతో ఆమె సేఫ్ అయింది. నెక్ట్స్ బిగ్ బాస్ ఇచ్చిన కార్డులు ముగ్గురు పంచుకోగా అలీ సేవ్ అవ్వగా….చివరికి భార్యాభర్తలుగా ఉన్న వరుణ్-వితికా పేర్లని నాగార్జున బోర్డు మీద పెడుతూ…వరుణ్ సేఫ్ అయినట్లు ప్రకటించి – వితికా ఎలిమినేట్ అయినట్లు తెలిపారు. ఇక భార్య వెళ్లిపోవడంతో వరుణ్ బోరున ఏడ్చాడు. ఆ తర్వాత ఎప్పటిలాగానే బిగ్ బాస్ స్టేజ్ మీదకొచ్చిన వితికా – ఇంటి సభ్యులతో మాట్లాడి బిగ్ బాంబ్ రాహుల్ మీద వేసింది.

దాని ప్రకారం బిగ్ బాస్ చెప్పేవరకు రాహుల్ బాత్ రూములు కడగాలి. అయితే వితికా 13 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉండటం ఆశ్చర్యకరమనే చెప్పాలి. అసలు వితికా మూడవ వారంలోనే ఎలిమినేట్ కావాల్సింది. కానీ అప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన తమన్నా సింహాద్రి వల్ల వితికా సేఫ్ అయింది. ఆ వారంలో నామినేషన్ లో ఈ ఇద్దరికీ తక్కువ ఓట్లు వచ్చాయి. కానీ తమన్నా చేసిన రచ్చ వల్ల ప్రేక్షకులు ఆమెని ఎలిమినేట్ అయ్యేలా చేశారు.

ఒకవేళ తమన్నా లేకపోతే వితికానే అప్పుడు బయటకు వెళ్ళేది. అయితే ఆ తర్వాత హౌస్ లో తన గ్రూప్ సహకరించడం – ఒకసారి కెప్టెన్ అవ్వడం – నెక్ట్స్ మెడాలియన్ ఉపయోగించి నామినేషన్ నుంచి బయటపడటం… కొన్నిసార్లు నామినేషన్ లోకి వెళ్లకపోవడంతో వితికా 13 వారాలు హౌస్లో కొనసాగి – ఎలిమినేట్ అయింది.