హిట్ ఇచ్చినా వెయిట్ చేయిస్తున్నారే !

0

గతేడాది సూపర్ హిట్స్ కొట్టిన దర్శకుల్లో వివేక్ ఆత్రేయ ఒకడు. ‘మెంటల్ మదిలో’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయిన ఈ కుర్రాడు ఆ సినిమా ఆడకపోవడంతో మళ్ళీ శ్రీ విష్ణునే పెట్టి రెండో సినిమాగా ‘బ్రోచేవారెవరురా’ తీశాడు. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా బాగానే ఆడింది. నిర్మాతలకు కూడా మంచి లాభాలే తెచ్చిపెట్టింది. దాంతో వివేక్ కి మైత్రి మూవీ మేకర్స్ నుండి అడ్వాన్స్ అందింది.

ఇంత వరకూ బాగానే ఉంది. కానీ ఏడాది దాటినా ఈ కుర్ర డైరెక్టర్ మూడో సినిమా పట్టాలెక్కలేదు. కథ రెడీగా ఉన్నా నిర్మాతలు ఉన్నా ఎందుకో ప్రాజెక్ట్ సెట్ అవ్వడం లేదు. ఇప్పటికే నాని లాంటి హీరోలకి స్క్రిప్ట్ చెప్పాడు. కానీ కుర్ర హీరోలు బిజీగా ఉందటం తో ఏమి చేయలేని పరిస్థితి. సూపర్ హిట్ డైరెక్టర్ పైగా బడా ప్రొడక్షన్ కంపెనీ అయినా కుర్ర హీరోలు తమ లైనప్ పక్కన పెట్టి వివేక్ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.

ఇదే కొనసాగితే వివేక్ మూడో సినిమా ఇంకా ఆలస్యం అయ్యేలా ఉంది. అయితే సూపర్ హిట్ ఇచ్చి కూడా మళ్ళీ కొత్త వారితో లేదా అప్ కమింగ్ హీరోలతో సినిమా చేయాలంటే పెద్ద సమస్య అందుకే వివేక్ లేట్ అయినా స్టార్ హీరో కోసం ఎదురుచూస్తున్నాడు. మరి ఈ కుర్ర దర్శకుడు నెక్స్ట్ ఏ హీరోను డైరెక్ట్ చేస్తాడో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-