అలా నా కెరీర్ నాశనం అయ్యింది

0

బాలీవుడ్ లో కొన్ని సంవత్సరాల ముందు సల్మాన్ ఖాన్ – షారుఖ్ ఖాన్ స్థాయిలో వివేక్ ఒబేరాయ్ హవా సాగేది. అయితే ఐశ్వర్య రాయ్ తో ప్రేమ సల్మాన్ ఖాన్ తో విభేదాల కారణంగా వివేక్ ఒబేరాయ్ కెరీర్ మొత్తం నాశనం అయ్యింది. అసలు వివేక్ ఒబేరాయ్ కి అసలు ఛాన్స్ లు రావడమే గగనం అయ్యింది. అప్పటి విషయాలను తాజాగా వివేక్ ఒబేరాయ్ మీడియా ముందు ముచ్చటించాడు. తాజాగా వివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘పీఎం నరేంద్ర మోడీ’ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఆ సందర్బంగా ఒక ఇంటర్వ్యూలో వివేక్ ఒబేరాయ్ పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు.

2003వ సంవత్సరంలో ఐశ్వర్య రాయ్ తో వివేక్ ఒబేరాయ్ ప్రేమలో ఉన్నాడు. అంతకు ముందు సల్మాన్ తో ప్రేమలో ఉన్న ఐశ్వర్య ఆయనకు బ్రేకప్ చెప్పి వివేక్ తో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్న నేపథ్యంలో ఒక సారి వివేక్ ఒబేరాయ్ కి సల్మాన్ ఖాన్ కాల్ చేసి బెదిరించాడట. చంపేస్తానంటూ హెచ్చరించాడట. ఆ విషయాన్ని మీడియా ముందుకు వివేక్ ఒబేరాయ్ తీసుకు వచ్చాడు. మీడియా ముందుకు వచ్చి తనను సల్మాన్ బెదిరించాడు అంటూ చెప్పడంతో అతడి కెరీర్ డౌన్ ఫాల్ స్టార్ అయ్యింది. అంతకు ముందు సూపర్ హిట్ వచ్చినా కూడా సంవత్సరం వరకు అసలు ఆఫరే రాలేదట. ఆ మీడియా సమావేశం తర్వాత ఐశ్వర్య రాయ్ తో కూడా సంబంధాలు తగ్గాయని అంటున్నారు.

ఇప్పుడు ఆ మీడియా సమావేశం పెట్టి తప్పు చేశానని భావిస్తున్నట్లుగా వివేక్ ఒబేరాయ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అలా చేసి ఉండకుంటే తన కెరీర్ పూర్తి విభిన్నంగా ఉండేదని వివేక్ ఒబేరాయ్ అంటున్నాడు. ఆ సంఘటన వల్ల నా కెరీర్ మొత్తం నాశనం అయ్యింది. నాకు సినిమాల్లో ఆఫర్లు ఇవ్వకూడదనే పత్వా కూడా జారీ అయ్యిందని నాకు తెలిసిందని వివేక్ ఒబేరాయ్ అన్నాడు.
Please Read Disclaimer