ఆమెకు ఓటు వేసి గెలిపించండి : మెహర్ రమేష్

0

స్టైలిష్ డైరెక్టర్ గా గుర్తింపు దక్కించుకున్న మెహర్ రమేష్ వరుస ఫ్లాప్ ల కారణంగా చాలా ఏళ్లుగా డైరెక్షన్ కు దూరంగా ఉంటున్నాడు. అయితే స్టార్ హీరోల సినిమాల కథా చర్చలు మరియు స్క్రీన్ ప్లే రైటింగ్ ఇలా తెర వెనుక చాలా పనులు చేస్తూ ఉన్నాడు. మళ్లీ సినిమా చేసే ఆలోచనల్లో కూడా ఈయన ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అప్పుడప్పుడు సినిమా వేడుకల్లో కనిపిస్తూ ఉన్న మెహర్ రమేష్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఉత్తరాదితో పాటు దక్షిణాదిలో కూడా ఎంతో మంది అభిమానించే డాన్స్ షో నాచ్ బలియే. ప్రస్తుతం ఈ డాన్స్ షో 9వ సీజన్ కొనసాగుతోంది. ఈ సీజన్ లో తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన అనీత తన భర్త రోహిత్ రెడ్డితో కలిసి పాల్గొంటుంది. ఈ జోడీకి రోనిత అని పేరు పెట్టారు. ఈ జంట ఇన్ని రోజులు తమ డాన్స్ లతో ఆకట్టుకున్నారు. మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో ఫైనల్ కు చేరుకున్నారు.

ఫైనల్ లో మొత్తం నాలుగు జంటలు ఉండగా రోనిత జంటకు సపోర్ట్ గా మెహర్ రమేష్ ట్వీట్ చేశాడు. మన తెలుగు హీరోయిన్ నువ్వేనువ్వే ఫేం అనిత కు ఓటు వేయాలంటూ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశాడు. మీ ప్రేమను మరియు అభిమానాన్ని చూపించండి అంటూ ఏ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలో ఆ నెంబర్ ను కూడా అక్కడ పోస్ట్ చేశాడు. జస్ట్ మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీ ఓటు వారికి పడిపోతుందని మెహర్ రమేష్ విజ్ఞప్తి చేశాడు. దాంతో పాటు మెహర్ రమేష్ నాచ్ బలియే 9 షో కు సంబంధించిన ఒక వీడియోను కూడా పోస్ట్ చేశాడు.
Please Read Disclaimer