‘మనం సైతం’కు వివి వినాయక్ భారీవిరాళం..

0

కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్ డౌన్ లో ఉన్న సంగతి తెలిసిందే. దేశ జనాభా మొత్తం వారి వారి ఇళ్లల్లో కూరుకుపోయింది. ఈ పరిస్థితులలో సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీల కంటే సినీ ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులను పేద కళాకారులకు “మనం సైతం” ఫౌండేషన్ తరపున చేయూతను అందిస్తున్నారు. ఇండస్ట్రీలో రోజువారీ కూలి పనిచేసే కార్మికులను దృష్టిలో పెట్టుకొని మెల్లగా సెలబ్రిటీలు విరాళాలు ఇవ్వడానికి కదిలి వస్తున్నారు.

తాజాగా ‘మనం సైతం’ ఫౌండేషన్ కు 5లక్షల విరాళాన్ని అందించాడు డైరెక్టర్ వివి వినాయక్. నటుడు కాదంబరి కిరణ్ కుమార్ ఈ ఫౌండేషన్ ను నిర్వహిస్తున్నాడు. ఈ విధంగా అందించిన విరాళాన్ని.. పేద కార్మికులు కళాకారులు మనం సైతంను సంప్రదించి సహాయాన్ని పొందవచ్చని డైరెక్టర్ వివి వినాయక్ వీడియో రూపంలో తెలియజేసాడు. నిత్యావసర సరుకులకు కూడా ఇబ్బంది పడుతున్న పేదవారికోసం తన వంతుగా 5లక్షలు అందించానని పేద కళాకారుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ‘మనం సైతం’ ఫౌండేషన్ ను అభినందించడం జరిగింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-