మళ్ళీ ఇన్నేళ్ళకి వెంకీతో!

0

స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ హీరోగా మారి ‘సీనయ్య’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే ప్రారంభమైన ఈ సినిమా నవంబర్ నుండి షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమా తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టి సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు వినాయక్. లేటెస్ట్ గా వెంకటేష్ కి కథ వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట. తను వెంకటేష్ తో సినిమా చేయనున్న విషయాన్ని లేటెస్ట్ గా ‘సీనయ్య’ ఓపినింగ్ లో చెప్పాడు వినాయక్.

నిజానికి ‘ఇంటెలిజెంట్’ తర్వాత వినాయక్ బాలయ్య తో ఓ రీమేక్ సినిమా ప్లాన్ చేసాడు. అది షూటింగ్ వరకూ వచ్చి ఆగిపోయింది. మళ్ళీ రవితేజతో సినిమా అనుకున్నాడు. అదీ కుదరలేదు. అందుకే ఇక ఫైనల్ గా వెంకీ కి ఫిక్స్ అయ్యాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లక్ష్మి సూపర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాలో వెంకటేష్ ను మాస్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేసి మంచి మార్కులు కొట్టేసాడు వినాయక్.

ప్రస్తుతం ఓ మూడు నెలల పాటు ‘సీనయ్య’ సినిమాకు కేటాయించాడు వినాయక్. మరో వైపు వెంకీ సినిమాకు ఫైనల్ స్క్రిప్ట్ కూడా రెడీ అవుతుంది. వినాయక్ ‘సీనయ్య’ పూర్తయ్యే లోపు వెంకీ తరుణ్ భాస్కర్ సినిమాను ఫినిష్ చేస్తాడని అంటున్నారు. ఈ సినిమాను నల్లమల బుజ్జి నిర్మించనున్నాడని సమాచారం. సో త్వరలోనే ఈ కాంబో సినిమా అనౌన్స్ అయ్యే చాన్స్ ఉంది.
Please Read Disclaimer