సీనయ్య ట్రెండీ టాక్

0

2003లో `దిల్` అనే సినిమాతో నిర్మాతగా పరిచయం అయ్యారు పంపిణీదారుడు రాజు. నితిన్ హీరోగా వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ఆ సినిమా బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత `దిల్` రాజు అయ్యారు ఆయన. అందుకే ఇప్పుడు వినాయక్ కెరీర్ డైలమాలో ఉన్నప్పుడు తనని హీరోగా పరిచయం చేసేందుకు సాహసమే చేశారు.

కొన్ని నెలల క్రితం దర్శకుడు వీ.వీ.వినాయక్ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని ప్రారంభించి.. దానికి `సీనయ్య` అనే టైటిల్ ని ప్రకటించారు. ఇది ఓ పీరియడ్ డ్రామా అయినా అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కించనున్నామని ప్రకటించారు. దర్శకుడు శంకర్ వద్ద సహాయకుడిగా పని చేసిన ఎన్.నరసింహా దర్శకత్వంలో సినిమా మొదలైంది. కొంత షూటింగ్ కూడా చేశారు. అయితే ఆ తర్వాత ఏమైందో అసలు సీనయ్య హడావుడి ఏమాత్రం కనిపించడం లేదు.

కనీసం పండగల వేళ కనీసం కొత్త పోస్టర్ అయినా రిలీజ్ చేయడం లేదు. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి ఆపేశారని తెలుస్తోంది. సీనయ్య ఔట్ పుట్ చూసిన దిల్ రాజు రషెస్ తో సంతృప్తి చెందలేదని.. స్క్రిప్ట్ పై మరింత వర్క్ చేయాలని దర్శకుడిని కోరారట. ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రస్తుతం దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే సినిమా క్యాన్సిల్ అన్నదాంట్లో లేదా వాయిదా పడింది అన్న దాంట్లో నిజం ఎంత? అన్నదానికి దిల్ రాజు స్పష్టతను ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆయన జాను ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. తదుపరి పలు క్రేజీ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు. ఇంతకీ తన ఫేవరెట్ డైరెక్టర్ వినాయక్ ని హీరోని చేస్తున్నట్టేనా లేదా? జస్ట్ వెయిట్.
Please Read Disclaimer