మెగా డైరెక్టర్ వైజాగ్ ఫిలింస్టూడియో లేనట్టే!

0

మెగాస్టార్ చిరంజీవి- అల్లు అరవింద్ సహా పలువురు సినీరాజకీయ ప్రముఖులు బీచ్ సొగసుల విశాఖ నగరంలో సినిమా స్టూడియోల నిర్మాణం చేపడతారని అప్పట్లో ప్రచారమైంది. ఏపీ – తెలంగాణ డివైడ్ అనంతరం ప్రముఖంగా చర్చకు వచ్చిన అంశమిది. అదే సమయంలో మెగా డైరెక్టర్ వీవీ వినాయక్ సైతం వైజాగ్ ఫిలిం ఇండస్ట్రీ విషయంలో ఆసక్తిగా ఉన్నారని మెగాభిమానులు ముచ్చటించుకున్నారు. ఆయన కూడా ఓ ఫిలింస్టూడియో నిర్మించే వీలుందన్న ప్రచారం సాగింది. విశాఖ సహా పలు నగరాల్లో వినాయక్ కి స్థలాలు ఉన్నాయి. విశాఖ ఔట్ స్కర్ట్స్ లో స్టూడియో నిర్మాణం చేపట్టే వీలుందని ముచ్చటించుకున్నారు.

కానీ రకరకాల రాజకీయ కారణాల వల్ల.. చంద్రబాబు ప్రభుత్వంలో అనాసక్తి వల్లనా విశాఖ ఫిలింస్టూడియోల అంశం తెరమరుగున పడిపోయింది. విజయవాడలో ఏపీ- ఎఫ్. డీ.సీ ఉన్నా ప్రచారం ఎక్కువ.. పని తక్కువ! అన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఏపీలో కళారంగంపై గత ప్రభుత్వ అనాసక్తిపై ఇండస్ట్రీ పెద్దల్లోనూ ఆసక్తికర చర్చ సాగింది. అయితే తాజాగా దర్శకుడు వీవీ వినాయక్ హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లో ఓ ఫిలింస్టూడియో నిర్మాణానికి సన్నాహకాల్లో ఉన్నారని సినీమీడియాలో ప్రచారం అవుతోంది.

హైదరాబాద్ రింగ్ రోడ్ కి కూతవేటు దూరంలో ఉన్న చేవెళ్ల పరిసరాల్లో వినాయక్ కి 20 ఎకరాల ఫామ్ ఉంది. అందులో వరల్డ్ క్లాస్ ఫిలింస్టూడియో నిర్మాణం చేపడతారని తెలుస్తోంది. ఇందులోనే రిసార్ట్ తో పాటుగా అధునాతన సౌకర్యాలతో స్టూడియో నిర్మాణం చేపట్టాలన్నది ప్లాన్. అందుకు ఇప్పటికే ప్రభుత్వ అనుమతులు లభించాయని చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే విశాఖలో ఫిలింస్టూడియో ఆలోచన విరమించుకున్న తర్వాతనే వినాయక్ ఈ ఆలోచన చేశారా? అన్న ముచ్చటా తాజాగా వేడెక్కిస్తోంది. ఇటీవలే హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లో మెగాస్టార్ చిరంజీవి ఫిలింస్టూడియో నిర్మించనున్నారని ప్రచారమైంది. కానీ దానికి సంబంధించిన ఏ సమాచారం లేదు. ఇంతలోనే వినాయక్ స్టూడియో అంటూ ప్రచారం వైరల్ అవుతోంది.

ఇక వినాయక్ కి వైజాగ్ జగదాంబ ఏరియాలో ఉన్న వీ-మ్యాక్స్ మల్టీప్లెక్స్ ని ఇప్పటికే సేల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన శీనయ్య అనే చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. నటుడిగా కొత్త ఇన్నింగ్స్ ని విజయవంతం చేయడం కోసం వినాయక్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది.
Please Read Disclaimer