ఈ సినిమా కలెక్షన్స్ కు ట్రేడ్ విశ్లేషకుల మైండ్ బ్లాంక్

0

భారీ అంచనాల నడుమ విడుదలైన బాలీవుడ్ మూవీ ‘వార్’ కు మొదట మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు నెగటివ్ రివ్యూలు ఇచ్చారు. కాని కలెక్షన్స్ చూస్తే సూపర్ హిట్ సినిమా రేంజ్ లో వస్తున్నాయి. గాంధీ జయంతి సందర్బంగా విడుదలైన హృతిక్ రోషన్.. టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన ‘వార్’ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు వచ్చిన చిత్రాల్లో ఇదే టాప్ ప్లేస్ లో చేరబోతుంది. నిన్న ఆది వారం వరకు కలెక్షన్స్ చూస్తే 301.5 కోట్ల వసూళ్లను ఈ చిత్రం రాబట్టిందట.

భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో దాదాపుగా 170 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం నిర్మాణం జరిగింది. విడుదలైన రోజు ఈ చిత్రం బడ్జెట్ రికవరీ చేస్తుందా అనే అనుమానాలు వచ్చాయి. కాని సినిమా మొదటి వీకెండ్ లోనే 100 కోట్లను క్రాస్ చేయడంతో అంతా ఆశ్చర్య పోయారు. ఇప్పుడు 300 కోట్లు వసూళ్లు చేయడంతో బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ లు బిత్తరపోయి మరీ చూస్తున్నారు.

సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వాణి కపూర్ హీరోయిన్ గా నటించింది. గత ఏడాది యశ్ రాజ్ ఫిల్మ్స్ కు థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రం భారీ నష్టాలను మిగిల్చింది. ఆ నష్టాలను ఈ సినిమా పూడ్చడంతో పాటు భారీగా లాభాలను కూడా తెచ్చి పెట్టిందంటూ బాలీవుడ్ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ‘వార్’కు వచ్చిన స్పందనతో త్వరలోనే సీక్వెల్ చేసే యోచనలో మేకర్స్ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. సీక్వెల్ లో టైగర్ ష్రాఫ్ ఉండడని.. హృతిక్ రోషన్ తో మరో యంగ్ హీరో ఎవరైనా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Please Read Disclaimer