బాక్స్ ఆఫీస్ దుమ్ము లేపిన వార్

0

హృతిక్ రోషన్.. టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో నటించిన యాక్షన్ ఫిలిం వార్ మొదటిరోజు భారీ కలెక్షన్స్ వసూలు చేసి చేసి ఈ ఏడాదికి హయ్యెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. మొదటి ఈరోజు 51.5 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ తో సల్మాన్ ఖాన్ సినిమా ‘భరత్’ ను వెనక్కు నెట్టింది.

దాదాపుగా ఈ సినిమాకు క్రిటిక్స్ అందరూ యావరేజ్.. డీసెంట్ అంటూ రివ్యూలు ఇచ్చారు కానీ కలెక్షన్స్ చూస్తే మాత్రం భారీగా ఉన్నాయి. హిందీ సినిమాల వరకూ చూసుకుంటే గతంలో హయ్యెస్ట్ డే 1 కలెక్షన్ రికార్డు అమీర్ ఖాన్ ఫిలిం ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ పేరిట ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును కూడా ‘వార్’ తుడిచిపెట్టేసింది. ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ మొదటి రోజు 50 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ దాటిన మొదటి సినిమా కాగా ఇప్పుడు ‘వార్’ ఆ సినిమాను దాటేసింది.

ఈ ఏడాది హయ్యెస్ట్ డే 1 కలెక్షన్స్ సాధించిన టాప్ -5 హిందీ చిత్రాల లిస్టు ఇదే( ఇండియా – నెట్ కలెక్షన్స్).

1. వార్: 53.35 cr
2. భరత్ 42.30 cr
3. మిషన్ మంగళ్: 29.16 cr
4. సాహో: 24.40 (హిందీ వెర్షన్)
5. కళంక్: 21.60 cr
Please Read Disclaimer