వార్నీ..వార్నర్ ప్రభుదేవా లెవల్ లో స్టెప్పులేస్తున్నాడుగా..!

0

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ రోజుకొక టిక్ టాక్ వీడియోతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పుడు లేటెస్టుగా వార్నర్ మరో వీడియోతో ముందుకొచ్చాడు. వార్నర్ ఈ లాక్ డౌన్ పీరియడ్ లో టిక్ టాక్ వీడియోలతో తెగ రెచ్చిపోతున్నాడు. లాక్ డౌన్ కారణంగా అన్ని క్రికెట్ టోర్నీలు రద్దు కావడంతో ఇంటికే పరిమితమయ్యాడు ఈ ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్. ఈ క్రమంలో తన ఫ్యాన్స్ ను అలరించాలనే ఉద్దేశంతో టిక్ టాక్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన భార్యా పిల్లలతో కలిసి టిక్ టాక్ వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు. ముఖ్యంగా మన సౌత్ ఇండియన్ సినిమా పాటలకు డైలాగ్స్ కి టిక్ టాక్ వీడియోస్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు.

ఇటీవల ‘అల వైకుంటపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ ‘రాములో రాములా’ పాటకు తన సతీమణితో కలిసి డ్యాన్స్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత ‘పోకిరి’ సినిమాలో మహేష్ బాబు ఫేమస్ డైలాగ్ ‘ఒక్కసారి కమిట్ అయితే..నా మాట నేనే వినను’ అని చెప్పి ఆకట్టుకున్నారు. మొన్న ‘సన్నజాని పడక’ అంటూ నిన్న ‘అమరేంద్ర బాహుబలి అను నేను..’ అనే ప్రభాస్ డైలాగ్ చెప్పి మురిపించాడు. ఇలా రోజుకొక వీడియోతో ఫ్యాన్స్ కి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించడంతో పాటుగా తన టాలెంట్ ని కూడా చూపిస్తున్నాడు. అంతటితో ఆగకుండా తాజాగా డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా ఎవర్ గ్రీన్ ‘ముక్కాలా ముక్కాబుల’ సాంగ్ కి వార్నర్ తన భార్య కాండీస్ తో కలిసి డాన్స్ చేశాడు.

స్ట్రీట్ డాన్సర్ మూవీ కోసం ‘ముక్కాల ముక్కాబుల’ సాంగ్ ని రీమిక్స్ చేయగా ఆ పాటకు డేవిడ్ వార్నర్ స్టెప్పులు చేసి ఆకట్టుకున్నారు. ‘మా ఇద్దరిలో బెటర్ డ్యాన్సర్ ఎవరో చెప్పండి’ అంటూ ఓ క్వశ్చన్ విసిరాడు. ప్రభుదేవా మరియు శిల్పాశెట్టి లను ట్యాగ్ చేసాడు. ప్రస్తుతం డేవిడ్ వార్నర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కాగా తమ అభిమాన హీరోలకు సంబంధించిన పాటలకు డైలాగ్ లకు టిక్ టాక్ చేయాలని ఫ్యాన్స్ వార్నర్ ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలని ‘మైండ్ బ్లాక్’ సాంగ్ కి టిక్ టాక్ చేయమని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేయగా ‘నేను ట్రై చేస్తాను’ అని వార్నర్ బదులిచ్చాడు. సో త్వరలో మైండ్ బ్లాక్ సాంగ్ తో మైండ్ బ్లాకయ్యే స్టెప్పులతో వార్నర్ ముందుకు రాబోతున్నాడన్నమాట.

 

View this post on Instagram

 

Who was better @candywarner1 and I or @theshilpashetty 😂😂 #theoriginals @prabhudevaofficial

A post shared by David Warner (@davidwarner31) onPlease Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home