రెండోసారి మైండ్ బ్లాక్ చేసిన వార్నర్..

0

ఈ ఏడాది సంక్రాంతి పండగకి సరిలేరు నీకెవ్వరూ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి నిజంగానే సరిలేరు తనకెవ్వరు అనిపించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో మైండ్ బ్లాక్ అనే సాంగ్ బాగా ఫేమస్ అయింది. ఎందుకంటే మహేష్ రష్మిక కాంబినేషన్లో డాన్స్ ఇరగదీసారు. మైండ్ బ్లాక్ పాట అయితే ఊపు ఊపేసింది. ఈ పాటలో మహేష్ రష్మిక చిందులు అందర్నీ కట్టిపడేశాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీకి మంచి మార్కులు పడ్డాయి. గత కొంతకాలంగా తాజాగా ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ టిక్ టాక్ లో దుమ్ములేపుతున్నాడు. తన భార్య క్యాండీతో కలిసి తాజాగా మైండ్ బ్లాక్ పాటకు చిందులేసి ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాడు.

డేవిడ్ వార్నర్ కొన్ని వారాలుగా తెలుగు హీరో మహేశ్ బాబును మాత్రం వదలట్లేడు. మొన్నేమో పోకిరి సినిమాలోని ‘ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుద్ధో.. వాడే పండుగాడు’ అంటూ అభిమానులకు కనువిందు చేసాడు. అలా మైండ్ బ్లాక్ డైలాగ్ మరువక ముందే.. మైండ్ బ్లాక్ అంటూ మహేష్ పాటతో మళ్లీ సందడి చేస్తున్నాడు. కానీ ఈసారి మాత్రం భార్య భర్తలు మైండ్ బ్లాక్ స్టెప్స్ పర్ఫెక్ట్ గా చేసాడని చెప్పవచ్చు. కరోనాతో ఇంటికే పరిమితమైన వార్నర్ టిక్టాక్లో మాత్రం దూసుకుపోతున్నాడు. మహేష్ మాత్రమే కాదు.. వార్నర్ ఏ తెలుగు హీరోని వదలట్లేడు. ముఖ్యంగా తెలుగు హీరోలు అల్లు అర్జున్ డార్లింగ్ ప్రభాస్.. కమల్ హాసన్ ఇలా అందరి పాటలకు యాక్టింగ్ కుమ్మేస్తున్నాడు. ఇక మరి వార్నర్ క్రికెట్ వదిలేసి హైదరాబాద్ లో సెటిల్ అయి సినిమాల్లో ట్రై చేస్తే బాగుంటుందేమో అని ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

After 50 attempts and will show a video of the attempts later we almost got there. Haha thoughts?? #mindblock @urstrulymahesh

A post shared by David Warner (@davidwarner31) on
Please Read Disclaimer