`తలైవి`కి ఇదో హెచ్చరిక లాంటిదే

0

తమిళ సినీపరిశ్రమలో ఒకేసారి అమ్మ జయలలితపై రెండు బయోపిక్ లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కంగన ప్రధాన పాత్రలో `తలైవి` ఇప్పటికే సెట్స్ పై ఉంది. కంగన-ఏ.ఎల్.విజయ్- విష్ణు ఇందూరి కాంబినేషన్ చిత్రమిది. అలాగే నిత్యామీనన్ టైటిల్ పాత్రలో ప్రియదర్శి దర్శకత్వంలో `ది ఐరన్ లేడీ` తెరకెక్కనుంది. నిత్యా తన పాత్ర కోసం ప్రిపరేషన్స్ సాగిస్తున్న సంగతి తెలిసిందే.

వీటితో పాటే ఓటీటీ వేదిక పై రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారిగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. క్వీన్ అనేది టైటిల్. జయలలిత జీవితాన్ని పలు పార్శ్యాల్లో ఈ వెబ్ సిరీస్ ఆవిష్కరించనుంది. గౌతమ్ మీనన్ తో కలిసి ప్రశాంత్ మురుగేశన్ ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు రమ్యకృష్ణ లుక్ ని రిలీజ్ చేశారు. ఈనెల 5న అధికారికంగా టీజర్ ని లాంచ్ చేయనున్నారు. ఎం.ఎక్స్ ప్లేయర్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

జయలలిత జీవితంలో స్కూల్ డేస్ తో పాటు కథానాయిక అయ్యాక అంచెలంచెలుగా ఎదిగిన క్రమం.. అటుపై రాజకీయాల్లోకి వెళ్లి యువ ముఖ్యమంత్రిగా సంచలనం సృష్టించిన వైనం ప్రతిదీ వెబ్ సిరీస్ లో చూపించనున్నారు. అయితే ఇంత డీటెయిల్డ్ గా వెబ్ సిరీస్ ని తమిళ ప్రజలు ఓటీటీ- డిజిటల్ వేదికపై వీక్షిస్తే ఆ తర్వాత రిలీజయ్యే `తలైవి`… `ది ఐరన్ లేడీ` చిత్రాల రిజల్ట్ పై ఆ ప్రభావం ఏ మేరకు ఉండనుంది? అన్నది చూడాలి.
Please Read Disclaimer