మళ్ళీ స్పీడు పెంచిన ప్రైమ్

0

ఓ నాలుగు నెలల క్రితం కొత్త సినిమాలు అతి తక్కువ టైంలోనే అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ లాంటి వీడియో స్ట్రీమింగ్ సైట్స్ లో పెట్టడం వల్ల ధియేటర్ రెవిన్యూలు తగ్గిపోతున్నాయని ఆ మధ్య 60 రోజులు గడువు విధించుకున్న మన తెలుగు నిర్మాతలు మెల్లగా దానికో పది రోజుల మినహాయింపు ఇచ్చేసి ఫిఫ్టీ డేస్ కి తగ్గించారు. దీని మూలంగా మళ్ళీ అమెజాన్ లో కొత్త మూవీస్ హడావిడి మొదలైంది.

ఇవాళ నుంచి శ్రీవిష్ణు బ్రోచేవారెవరురా అందుబాటులోకి వచ్చింది. కొద్దిరోజుల క్రితం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయను పెడితే మంచి స్పందన దక్కినట్టుగా సోషల్ మీడియా ట్రెండ్స్ ని బట్టి అర్థమవుతోంది. ఇప్పుడు అది వచ్చిన తక్కువ నిడివిలోనే ఇది రావడం గమనార్హం అలా అని ప్రతి సినిమా యాభై రోజుల రూల్ ఏమి పాటించడం లేదు. శ్రీహరి వారసుడు మేఘంష్ రాజ్ దూత్ మూవీ రెండు వారాలకే పెట్టారు. నేను లేను అనే మరో క్రైమ్ థ్రిల్లర్ ది అదే పరిస్థితి.

ఒప్పందం చేసుకునే టైంలోనే కంటెంట్ ని బట్టి నిర్మాతలకు తమ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ ని బట్టి ఈ గడువులు మారుతున్నాయి. ఏదైతేనేం హోమ్ ఎంటర్ టైన్మెంట్ లో కొత్త విప్లవానికి శ్రీకారం చుట్టిన ప్రైమ్ లో మళ్ళీ కొత్త సినిమాల జోరు ఊపందుకుంది. ఇదే ట్రెండ్ కొనసాగాలని మూవీ లవర్స్ కోరుతున్నారు. గడువు తగ్గి మళ్ళీ పరిస్థితి మొదటికే రాకూడదని ఎగ్జిబిటర్లు ఆకాంక్షిస్తున్నారు
Please Read Disclaimer