మాకో మూడు వాట్సాప్ గ్రూపులున్నాయి.. మేమంతా ఒకటే

0

తాజాగా తమన్ నుండి వరుస సూపర్ హిట్స్ సాంగ్స్ వస్తున్నాయి. ‘సామజవరగమనా’ నుండి మొదలు కొని తమన్ నుండి వచ్చిన ప్రతి సాంగ్ హిట్ అనిపించుకుంటుంది. అయితే మరో వైపు దేవిను టార్గెట్ చేస్తూ ఇట్స్ తమన్ టైం అంటూ సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుంది.

అయితే ఈ విషయంపై లేటెస్ట్ గా స్పందించాడు తమన్. తమ మధ్య ఎలాంటి పర్సనల్ గొడవలు ఉండవని ఎవరైనా సాంగ్ కంపోజ్ చేసి అది హిట్టయితే తమదే అన్నట్టుగా ఫీలవుతామని అన్నాడు. మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ మూడు వాట్సాప్ గ్రూపులు కూడా ఉన్నాయని తమ మధ్య వర్క్ విషయంలోనే కాంపిటిషన్ తప్ప బయట మేము చాలా క్లోజ్ గా ఉంటామని తెలిపాడు.

ఏదైనా సాంగ్ పెద్ద హిట్టైయితే మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య ఎలాంటి విబేధాలు ఉండవని ఎవరూ ఫీలవ్వరనేది తమన్ వాదన. బయట అభినందించినా లోలోపల నాకెందుకు ఎలాంటి సాంగ్ పడలేదనే ఫీలింగ్ ఉండదా ఏంటి..? అది తమన్ కి కూడా తెలుసు కానీ ఇలా కవర్ చేసాడంతే.
Please Read Disclaimer