వైరల్ వీడియో: సాహో వరం గా మారిన భీమవరం!

0

దేశంలో ఎక్కడ సినీప్రియుల మధ్య చర్చ జరిగినా.. ఆ చర్చలో తప్పకుండా ‘సాహో’ ప్రస్తావన వస్తుంది. ‘బాహుబలి’ లాంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ల తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి 2’ తర్వాత ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్న సినిమా ఇదేనని ఆన్ లైన్ టికెటింగ్ ప్లాట్ ఫామ్స్ లో బుకింగ్ ట్రెండ్స్.. లైక్స్ చూస్తేనే మనకు అర్థం అవుతుంది. ఇక ప్రభాస్ పుట్టింది చెన్నైలోనే అయినప్పటికీ సొంత ఊరు పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గంలోని మొగల్తూరు. అయితే ప్రభాస్ కు అత్యధికంగా ఫ్యాన్స్ ఉండే ఏరియా మాత్రం భీమవరం. ప్రభాస్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా భీమవరం ప్రభాస్ జపంతో ఊగిపోతుంది.

ఈసారి ఆ జపం కాస్తా వైరల్ ఫీవర్ గా మారింది. భీమవరం టౌన్ లో ఏమూల చూసినా ప్రభాస్ పోస్టర్లు.. బ్యానర్లు.. కటౌట్లు.. ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. భీమవరం పట్టణమే కాదు చుట్టుపక్కల ఉండే పల్లెల్లో కూడా ప్రభాస్ పోస్టర్ల హంగామా ఉందంటే జనాలు సాహో ఫీవర్ తో ఎలా ఊగిపోతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కొందరు నెటిజన్లు ఈ హంగామా చూసి ‘ఇది భీమవరం కాదు సాహోవరం’ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. భీమవరంలోనే ఒక రోడ్ లో అయితే లాంగెస్ట్ ఫ్లెక్సీ నెలకొల్పి అభిమానులు డార్లింగ్ పై తమ ప్రేమను చాటుకున్నారు. ఆ ఫ్లెక్సీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇప్పుడే ఇలా ఉంటే ప్రీమియర్ షోల సమయంలో.. ఫస్ట్ డే ఫస్ట్ షోలకు ప్రభాస్ అభిమానుల హంగామా ఆకాశాన్ని తాకుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. సినిమా కనుక అంచనాలను అందుకుంటే ఈ ఉత్సాహం డబల్ కావడం ఖాయమే.
Please Read Disclaimer